లక్ష దాటిన వార్తా పత్రికల సంఖ్య
మనదేశంలో జాతీయ, ప్రాంతీయ భాషల్లో ప్రచురితం అవుతున్న పత్రికల సంఖ్య లక్ష దాటిందని రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా ప్రకటించింది. గత రెండేండ్లలొ 11,376 పత్రికలు ఆవిర్భవించాయని, తెలంగాణలో 203 సంస్థలు నమోదయ్యాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 16,130 పత్రికలు వెలువుడుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 203 పత్రికలు పేర్లను రిజిస్టర్ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 5575 పత్రికలుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య […]
BY sarvi9 Aug 2015 1:14 PM GMT
X
sarvi Updated On: 10 Aug 2015 4:51 AM GMT
మనదేశంలో జాతీయ, ప్రాంతీయ భాషల్లో ప్రచురితం అవుతున్న పత్రికల సంఖ్య లక్ష దాటిందని రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇండియా ప్రకటించింది. గత రెండేండ్లలొ 11,376 పత్రికలు ఆవిర్భవించాయని, తెలంగాణలో 203 సంస్థలు నమోదయ్యాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 16,130 పత్రికలు వెలువుడుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 203 పత్రికలు పేర్లను రిజిస్టర్ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 5575 పత్రికలుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 6215కు చేరింది. లక్షద్వీప్, నాగాలాండ్‌లో కూడా కొత్త పత్రికలు ప్రారంభమయ్యాయి. ఆర్ఎన్ఐలో నమోదైన వివరాల ప్రకారం 2011-12,2013-14లో హిందీ, ఆంగ్ల, ఉర్దూ పత్రికల సర్క్యులేషన మినహా మిగతా పత్రికల సర్క్యులేషన్ పెరిగిందని ఆర్ఎన్ఐ తెలిపింది.
Next Story