Telugu Global
Others

నిగ్గదీసి అడుగుతున్నాం... ఈ సిగ్గులేని ప్రభుత్వాల్ని: కాంగ్రెస్‌

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఎందుకివ్వరు? కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ప్రకటనకు బీజేపీ ఎందుకు కట్టుబడదు… చట్టసభల్లో ఎవరు ఏ ప్రకటన చేసినా దాన్ని కొనసాగింపు చర్యలు తర్వాత ప్రభుత్వాలు తీసుకోవలసిన బాధ్యత లేదా… నిగ్గదీసి అడుగుతున్నాం… ఈ సిగ్గులేని ప్రభుత్వాల్ని… అంటూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ కాంగ్రెస్‌ పార్టీ వీధి పోరాటాలు చేస్తుందని రఘువీరారెడ్డి ప్రకటించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు మానవత్వం […]

నిగ్గదీసి అడుగుతున్నాం... ఈ సిగ్గులేని ప్రభుత్వాల్ని: కాంగ్రెస్‌
X

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఎందుకివ్వరు? కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ప్రకటనకు బీజేపీ ఎందుకు కట్టుబడదు… చట్టసభల్లో ఎవరు ఏ ప్రకటన చేసినా దాన్ని కొనసాగింపు చర్యలు తర్వాత ప్రభుత్వాలు తీసుకోవలసిన బాధ్యత లేదా… నిగ్గదీసి అడుగుతున్నాం… ఈ సిగ్గులేని ప్రభుత్వాల్ని… అంటూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకూ కాంగ్రెస్‌ పార్టీ వీధి పోరాటాలు చేస్తుందని రఘువీరారెడ్డి ప్రకటించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులకు మానవత్వం ఉంటే.. సిగ్గుంటే.. మనుషులైతే తక్షణం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలో శనివారం ప్రత్యేక హోదా డిమాండ్‌తో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ‘పోరు సభ’లో ఆయన మాట్లాడారు. తిరుపతిలో ఎవరైనా ఒక మాట చెబితే ఆ మాటపై నిలబడతారని, అలాంటిది తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ, వెంకయ్యలు ఇదే పుణ్యక్షేత్రంలో.. తమకు ఓటేస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేసిన చంద్రబాబు మోడీ సర్కార్‌ ముందు మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజిస్తే రూ. 5 లక్షల కోట్లు అడిగిన పెద్ద మనిషి చంద్రబాబు ఇపుడెందుకు నోరు మూసుకు కూర్చున్నారని ఆయన ప్రశ్నించారు. ‘బీజేపీకి ఈనెల 13వ తేది వరకు సమయం ఇస్తున్నాం. పార్లమెంట్‌ ముగిసేలోపు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్యాకేజీలన్నీ ఇవ్వాలి. లేదంటే మోడీ, వెంకయ్య మోసం చేశారని, ప్రత్యేక హోదా ఇస్తామని వంచన చేశారని రాష్ట్రంలోని 1200 పోలీసు స్టేషన్లలో కేసులు పెడతాం’ అని రఘువీరా హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని రఘువీరా స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన పాపం అన్ని రాజకీయ పార్టీలదన్నారు. విభజనకు ఆమోదం తెలుపుతూ వారంతా సంతకాలు చేసిన తర్వాతే కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. నవ్యాంధ్రకు రూ.5 లక్షల కోట్లు ప్రయోజనం చేకూరేలా ప్రత్యేకహోదాను నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటిస్తే.. చట్టంలో లేదంటూ ఈ రోజు కేంద్రం దాటవేస్తోందన్నారు. ఈనెల 11న ప్రత్యేక హోదా కోసం సీపీఐ చేస్తున్న బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ సంఘీభావం తెలుపుతుందన్నారు. బంద్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ 10వ తేదీన ఢిల్లీలో ధర్నా చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఎగ్గొట్టాలా అని ఎన్డీయే ప్రభుత్వం చూస్తోందని, అందుకే కుంటిసాకులు చెబుతోందని పార్లమెంటుసభ్యుడు చిరంజీవి ఆరోపించారు. నాడు పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో వెంకయ్య మాట్లాడారని, దానికి తానే ప్రత్యక్ష సాక్షినని చిరంజీవి అన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీకి ముందు వెనుక అన్నీ వెంకయ్యే. అలాంటి ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదాపై ప్రధానిని ఎందుకు అడగటం లేదని చిరంజీవి ప్రశ్నించారు. ఏపీని దత్తత తీసుకుంటానని తిరుపతి సభలో చెప్పిన మోదీ.. ఇప్పుడా ప్రస్తావనే ఎత్తటం లేదన్నారు. బీజేపీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు నేరగాళ్లకు సహకరిస్తూ కుంభకోణాల్లో ఇరుక్కున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో ఎప్పుడు తనను అరెస్టు చేస్తారోనన్న భయంతో సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ ముందు మోకరిల్లి తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని, ప్రత్యేక హోదాపై అడగటం లేదని చిరంజీవి అన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు చట్టరూపం అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. గతంలో ఉత్తరాఖండ్‌కు మంత్రివర్గ తీర్మానం ద్వారా ప్లానింగ్‌ కమిషన్‌ నుంచి నిధులు ఇచ్చారని, అదే తరహాలో ఇప్పుడూ ఏపీకీ ఇవ్వాలన్నారు.

First Published:  9 Aug 2015 3:27 AM IST
Next Story