Telugu Global
Others

రాష్ర్ట‌ప‌తి గారూ..ప్లీజ్..మ‌మ్మ‌ల్ని చావ‌నివ్వండి!

రాష్ర్ట‌ప‌తి గారూ..మాకు భ‌విష్య‌త్తు లేదు. ప్లీజ్..మ‌మ్మ‌ల్ని చావ‌నివ్వండి అని వేడుకుంటున్నారు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన డాక్ట‌ర్లు. వ్యాపం కుంభ‌కోణంలో నిందితులుగా ఉన్న 70మంది వైద్యులు, వైద్య విద్యార్థులు ఈమేర‌కు రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీకి లేఖ పంపారు. చాలాకాలంగా గ్వాలియ‌ర్ జైల్లో మ‌గ్గుతున్న త‌మ‌ను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి అనుమ‌తించాల‌ని ప్రాధేయ‌ప‌డ్డారు. వ్యాపం కుంభ‌కోణంలో త‌మ‌ను బ‌లిప‌శువుల‌ను చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. న్యాయ ప్ర‌క్రియ‌లో జాప్యంతో జైల్లోనే మ‌గ్గుతున్న త‌మ‌కు భ‌విష్య‌త్తు అంధ‌కారంగా క‌నిపిస్తోంద‌నీ., త‌మ‌కు చావుత‌ప్ప వేరే మార్గం లేద‌ని రాష్ట్ర‌ప‌తికి రాసిన […]

రాష్ర్ట‌ప‌తి గారూ..ప్లీజ్..మ‌మ్మ‌ల్ని చావ‌నివ్వండి!
X

రాష్ర్ట‌ప‌తి గారూ..మాకు భ‌విష్య‌త్తు లేదు. ప్లీజ్..మ‌మ్మ‌ల్ని చావ‌నివ్వండి అని వేడుకుంటున్నారు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన డాక్ట‌ర్లు. వ్యాపం కుంభ‌కోణంలో నిందితులుగా ఉన్న 70మంది వైద్యులు, వైద్య విద్యార్థులు ఈమేర‌కు రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీకి లేఖ పంపారు. చాలాకాలంగా గ్వాలియ‌ర్ జైల్లో మ‌గ్గుతున్న త‌మ‌ను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి అనుమ‌తించాల‌ని ప్రాధేయ‌ప‌డ్డారు. వ్యాపం కుంభ‌కోణంలో త‌మ‌ను బ‌లిప‌శువుల‌ను చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. న్యాయ ప్ర‌క్రియ‌లో జాప్యంతో జైల్లోనే మ‌గ్గుతున్న త‌మ‌కు భ‌విష్య‌త్తు అంధ‌కారంగా క‌నిపిస్తోంద‌నీ., త‌మ‌కు చావుత‌ప్ప వేరే మార్గం లేద‌ని రాష్ట్ర‌ప‌తికి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ప్రెసిడెంట్‌తోబాటు ఆ లేఖ‌ను ప్ర‌ధాని, కేంద్ర హోంమంత్రి, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, మ‌ధ్య‌ప్ర‌దేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిల‌కు కూడా పంపారు డాక్ట‌ర్లు.

వ్యాపం స్కాంలో త‌మ‌పై ఉన్న ఆరోప‌ణ‌లే ఎదుర్కొంటున్న భోపాల్‌, జ‌బ‌ల్‌పూర్ వైద్యుల‌కు బెయిల్ వ‌చ్చింద‌నీ., మ‌రి గ్వాలియ‌ర్ వైద్యుల‌పై ఎందుకీ వివ‌క్ష అని మండిప‌డుతున్నారు. చాలాకాలంగా జైల్లో ఉండ‌టంతో త‌మ కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయ‌నీ., మాన‌సికంగా తాము కుంగిపోతున్నామ‌ని లేఖ‌లో వైద్యులు పేర్కొన్నారు. త‌మ‌లో నెగెటివ్ థాట్స్ పెరుగుతున్నాయ‌నీ., ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయ‌ని వివ‌రించారు.

వ‌రుస అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు
మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ కాలేజీల్లో ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌తోబాటు..వివిధ ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎంట్ర‌న్స్ టెస్ట్‌ల నిర్వ‌హ‌ణ‌లో ప‌దేళ్లుగా అక్ర‌మాలు జ‌రిగాయి. అన‌ర్హుల‌కు మెడిక‌ల్ సీట్లు వ‌చ్చాయి. మెరిట్‌ని ప‌క్క‌న‌బెట్టి ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ట్ట‌బెట్ట‌డంతో వ్యాపం బోర్డు తీరుపై దుమారం రేగింది. ఈ స్కామ్‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న49మంది వ్య‌క్తులు అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించ‌డం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ని కుదిపేసింది. కేసులో నిందితుడైన‌ మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ కొడుకు కూడా అనుమానాస్ప‌ద స్థితిలో చ‌నిపోయాడు. ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌తోబాటు గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యానికి కూడా కుంభ‌కోణంలో పాత్ర ఉంద‌నీ ఆరోప‌ణ‌లున్నాయి. ఇంత‌వ‌ర‌కు వ్యాపం స్కామ్‌లో 2000 వేల‌మందిని ప్ర‌శ్నించారు. వంద‌ల‌మంది నిందితులు మ‌ధ్య‌ప్ర‌దేశ్ జైళ్ల‌లో ఉన్నారు. వ్యాపం వ‌రుస మ‌ర‌ణాల‌పై విప‌క్ష కాంగ్రెస్ సిబిఐ ద‌ర్యాప్తుకు డిమాండ్ చేసింది. వ్యాపం స్కాం.. దేశంలో అతిపెద్ద ఉద్యోగ కుంభ‌కోణం మాత్ర‌మేకాదు..వ‌రుస అనుమానాస్ప‌ద మ‌ర‌ణాల‌తో అతిపెద్ద మిస్ట‌రీగా కూడా మారింది.

First Published:  9 Aug 2015 5:41 AM IST
Next Story