రిషితేశ్వరి ప్రాణం పోవడానికి 10 కారణాలు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి రాలిపోయిన రిషితేశ్వరి మరణానికి ప్రిన్సిపల్ వైఖరే కారణమని కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అక్కడున్న అధ్వానమైన 10 పరిస్థితులు రిషితేశ్వరి ప్రాణం తీశాయి. 1. రిషితేశ్వరి మరణానికి కారణం ర్యాగింగే అందులో అనుమానమేం లేదు. 2. సీనియర్లతో అధ్యాపకులు రాసుకు పూసుకు తిరిగేవారు, దీనిని వారు అలుసుగా తీసుకుని జూనియర్లను వేధించేవారు. 3. కులాల ఆధారంగా విద్యార్థులు, అధ్యాపకులు విడిపోయారు. ఎవరి కులం వారినివారు వెనకేసుకు రావడం అక్కడ […]
BY sarvi9 Aug 2015 6:06 AM IST
X
sarvi Updated On: 9 Aug 2015 7:05 AM IST
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతానికి రాలిపోయిన రిషితేశ్వరి మరణానికి ప్రిన్సిపల్ వైఖరే కారణమని కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అక్కడున్న అధ్వానమైన 10 పరిస్థితులు రిషితేశ్వరి ప్రాణం తీశాయి.
1. రిషితేశ్వరి మరణానికి కారణం ర్యాగింగే అందులో అనుమానమేం లేదు.
2. సీనియర్లతో అధ్యాపకులు రాసుకు పూసుకు తిరిగేవారు, దీనిని వారు అలుసుగా తీసుకుని జూనియర్లను వేధించేవారు.
3. కులాల ఆధారంగా విద్యార్థులు, అధ్యాపకులు విడిపోయారు. ఎవరి కులం వారినివారు వెనకేసుకు రావడం అక్కడ సర్వసాధారణం.
4. కులసంఘాల ఏర్పాటు కూడా విద్యార్థుల్లో వైషమ్యాలు పెరగడానికి దోహదపడ్డాయని కమిటీ రిపోర్టు కుండబద్దలు కొట్టింది.
5. ప్రిన్సిపల్ సీనియర్లతో తిరగడం, వారితో మందు సేవించడం తదితర ఘటనలు జూనియర్ల మనసును గాయపరిచాయి.
6. జూనియర్లను అధ్యాపకుల ముందే వేధించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో సీనియర్లు మరింత చెలరేగిపోయేవారని చెప్పింది.
7. ఈ పరిణామాలతో సీనియర్లపై ఫిర్యాదు చేసేందుకే జూనియర్లు జంకేవారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా స్పందన శూన్యంగా ఉండేది.
8..ఫ్రెషర్స్‌డే పార్టీలో సీనియర్లతో కలిసి ప్రిన్సిపాల్ బాబురావు మద్యం సేవించడం.
9. రాత్రి 10-2 గంటల వరకు విద్యార్థులు పడుకునే వారు కాదు. ఆ సమయాల్లో జూనియర్లను ర్యాగింగ్ చేసేవారు.
10. జూనియర్లను వేధించి ఆ దృశ్యాలను వీడియోలు తీసి వాటిని వాట్సాప్‌లో అప్‌లోడ్ చేయడం ఇక్కడ సర్వసాధారణమని కమిటీ నివేదించింది.
Next Story