ఉత్తరాలతో పాటు అప్పులూ
తపాలా శాఖ శరవేగంగా పని తీరును మార్చుకుంటోంది. నష్టాల్లో ఉన్న పోస్టల్ డిపార్టమెంటు తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం ఆధునిక విధానాలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇకపై పోస్టల్ శాక ఉత్తరాల బట్వాడాతో పాటు అప్పులను కూడా అందించనుంది. రైతులు, చిరు వ్యాపారులకు రూ. 25 వేల లోపు అప్పులు ఇవ్వాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. అనుమతి కోసం రిజర్వ్‌బ్యాంకుకు దరఖాన్తు చేసేందుకు రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా ఊర్లలోని […]
BY sarvi8 Aug 2015 6:40 PM IST
X
sarvi Updated On: 9 Aug 2015 9:22 AM IST
తపాలా శాఖ శరవేగంగా పని తీరును మార్చుకుంటోంది. నష్టాల్లో ఉన్న పోస్టల్ డిపార్టమెంటు తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం ఆధునిక విధానాలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇకపై పోస్టల్ శాక ఉత్తరాల బట్వాడాతో పాటు అప్పులను కూడా అందించనుంది. రైతులు, చిరు వ్యాపారులకు రూ. 25 వేల లోపు అప్పులు ఇవ్వాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. అనుమతి కోసం రిజర్వ్‌బ్యాంకుకు దరఖాన్తు చేసేందుకు రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా ఊర్లలోని తపాలా శాఖలను బ్యాంకులుగా మార్చాలని, బ్యాంకుల్లో జరిగే లావాదేవీల మాదిరిగానే పోస్టాఫీసుల్లో కూడా జరిపేందుకు అనుమతివ్వాల్సిందిగా రిజర్వ్ బ్యాంకును కోరనుంది. ఈ నెలాఖరులోగా రిజర్వ్ బ్యాంకు అనుమతి లభిస్తుందని పోస్టల్ అధికారులు వెల్లడిచారు.
Next Story