Telugu Global
Cinema & Entertainment

ల‌క్ష్మీరాయ్ చిల‌క ప‌లుకులు..! 

హీరోయిన్ మెటీరియ‌ల్  అయ్యుండి కూడా మంచి బ్రేక్  రాక  సెకండ్ హీరోయిన్ గా నెట్టుకొస్తున్న లిస్ట్ లో మ‌న బెంగ‌ళూరు బొద్దుగుమ్మ ల‌క్ష్మి రాయ్ కూడా ఉంది. తెలుగులో బాల‌య్య స‌ర‌స‌న శ్రీ‌మ‌న్నారాయ‌ణ చిత్రం ..  లారెన్స్ స‌ర‌స‌న ఒక‌టి రెండు చిత్రాలు.. ర‌వితేజ  బ‌లుపు చి్త్రంలో స్పెష‌ల్ సాంగ్  చేసి మన ఆడియ‌న్స్ కు బాగానే ట‌చ్ లో ఉంది. ఆఫ్ కోర్స్  ల‌క్ష్మిరాయ్ అంటే ద‌క్షిణాది ఆడియ‌న్స్  కు బాగానే తెలుసు.. బాలీవుడ్  ఆడియ‌న్స్ […]

ల‌క్ష్మీరాయ్ చిల‌క ప‌లుకులు..! 
X
హీరోయిన్ మెటీరియ‌ల్ అయ్యుండి కూడా మంచి బ్రేక్ రాక సెకండ్ హీరోయిన్ గా నెట్టుకొస్తున్న లిస్ట్ లో మ‌న బెంగ‌ళూరు బొద్దుగుమ్మ ల‌క్ష్మి రాయ్ కూడా ఉంది. తెలుగులో బాల‌య్య స‌ర‌స‌న శ్రీ‌మ‌న్నారాయ‌ణ చిత్రం .. లారెన్స్ స‌ర‌స‌న ఒక‌టి రెండు చిత్రాలు.. ర‌వితేజ బ‌లుపు చి్త్రంలో స్పెష‌ల్ సాంగ్ చేసి మన ఆడియ‌న్స్ కు బాగానే ట‌చ్ లో ఉంది. ఆఫ్ కోర్స్ ల‌క్ష్మిరాయ్ అంటే ద‌క్షిణాది ఆడియ‌న్స్ కు బాగానే తెలుసు.. బాలీవుడ్ ఆడియ‌న్స్ కు మాత్రం తెలియ‌క పోవ‌చ్చు.
అయితే ఇక ముందు.. బి టౌన్ ఆడియ‌న్స్ కి కూడా ఈ ముద్దుగుమ్మ తెలిసిపోతుంది అన‌డంలో సందేహాం లేదు. ఎందుకంటే ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ తో “అకీరా న ఏ” అనే హింది చిత్రం చేస్తుంది. సోనాక్షి సిన్హా లీడ్ రోల్ చేస్తున్న ఆ చిత్రం .. “మౌనగురు” అనే త‌మిళ సినిమా. ఈ చిత్రంలో ల‌క్ష్మిరాయ్ ఒక కీ రోల్ లో చేస్తుంది.తొలిసారిగా బాలీవుడ్ చిత్రం చేయ‌డం ఎంజాయ్ చేస్తుందట ఈ అమ్మడు. వ‌ర్క్ ప‌రంగా కూడా త‌న‌కు ఎంతగానో న‌చ్చింద‌ట. నార్త్ వాళ్ళు న‌చ్చిన‌ట్లు చేసుకుంటు పోతారు . అంతే గానీ సౌత్ లో మాదిరి టైమ్ ను ఫాలో అవ్వ‌రంటూ చెప్పింది. ఇక కాంట్ర‌వర్సీలంటే ద‌క్షిణాది సెలిబ్రిటీలు భ‌య‌ప‌డిపోతారు. కానీ బాలీవుడ్ లో ఎంత కాంట్ర‌వర్సీ..అయితే అంత మంచిద‌ని ఫీల్ అవుతార‌నే విష‌యం అర్ధం చేసుకుంద‌ట‌. అయితే త‌ను మాత్రం ఆ విధ‌మైన ప్ర‌చారాన్ని ఏ మాత్రం కోరుకోవ‌డం లేద‌ట‌.
ఇక అకీర చిత్రం గురించి చెబ‌తు.. త‌న రోల్ చిన్న‌దే అయిన‌ప్ప‌టికి.. డైరెక్ట‌ర్ ముర‌గ‌దాస్ ఎంతో కీల‌కంగా డిజైన్ చేశార‌ని .. ఈ సినిమా రిలీజ్ అయిన త‌రువాత త‌న‌కు బాలీవుడ్ లో మ‌రిన్ని ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయ‌మ‌ని ఆశ ప‌డుతుంది. మొత్తం మీద ల‌క్ష్మీరాయ్ బి టౌన్ లోకి ఎంట్రీ ఇవ్వ‌గానే చిల‌క ప‌లుకులు ప‌లుకుతుంది అన్న‌మాట‌.
First Published:  9 Aug 2015 12:35 AM IST
Next Story