జర నవ్వండి ప్లీజ్ 169
ప్రకటన పేపర్లో వచ్చిన ప్రకటన ఇలా ఉంది. “మీకు చదువు రాదా? మీకు చదవడమూ, రాయడమూ రాదా? అయితే మమ్మల్ని సంప్రదించండి. మాకు వెంటనే ఉత్తరం రాయండి. మీకు సహాయపడతాం”. ———————————————————————– గిప్ట్ “నువ్వు చెక్కుమీద రాస్తోంది వెయ్యి రూపాయలేనా?. ఎందుకన్ని డబ్బులు” అని అడిగారు అరవింద్ తన స్నేహితుడు రాహుల్‌ని. “అవును మా చెల్లెలు పుట్టిన రోజుకు గిఫ్టుగా ఇద్దామని” అన్నాడు రాహుల్. “అయితే సిగ్నేచర్ చేయలేదేంటి మరి” అన్నాడు అరవింద్. “చెక్కు ఎవరు పంపారో […]
ప్రకటన
పేపర్లో వచ్చిన ప్రకటన ఇలా ఉంది.
“మీకు చదువు రాదా? మీకు చదవడమూ, రాయడమూ రాదా? అయితే మమ్మల్ని సంప్రదించండి. మాకు వెంటనే ఉత్తరం రాయండి. మీకు సహాయపడతాం”.
———————————————————————–
గిప్ట్
“నువ్వు చెక్కుమీద రాస్తోంది వెయ్యి రూపాయలేనా?. ఎందుకన్ని డబ్బులు” అని అడిగారు అరవింద్ తన స్నేహితుడు రాహుల్‌ని.
“అవును మా చెల్లెలు పుట్టిన రోజుకు గిఫ్టుగా ఇద్దామని” అన్నాడు రాహుల్.
“అయితే సిగ్నేచర్ చేయలేదేంటి మరి” అన్నాడు అరవింద్.
“చెక్కు ఎవరు పంపారో మా చెల్లికి తెలియకూడదని” సమాధానం చెప్పాడు రాహుల్.
———————————————————————–
సీట్ల గోల
సినిమా చాలా రష్‌గా ఉంది. రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎవరికి దొరికిన సీట్లలో వాళ్లు కూర్చున్నారు. కొత్తగా పెళ్లయిన జంట సినిమాకు వచ్చింది. ఆమె ఎవరో ఒకతను కూర్చోబోతున్న సీట్లోకి దూసుకెళ్లి కూర్చుంది. అతను విస్తుపోయి చూశాడు. ఆమె పక్కసీట్లో ఆమె భర్త అప్పటికే సెటిలయిపోయాడు. సీటు లేని వ్యక్తి చిరాకుగా అటూ ఇటూ చూశాడు. ఆమె భర్త సీటులేని వ్యక్తిని చూసి “సారీ! మీ సీటు మేం లాక్కున్నాం” అన్నాడు. భార్య కిసుకున్న నవ్వింది. దాంతో చిర్రెత్తిన ఆ వ్యక్తి ఆమె భర్తని చూసి “ఏం ఫర్వాలేదులేండి. మీరు, మీ అమ్మ సినిమా ఎంజాయ్ చేస్తే నాకదే చాలు” అని వెళ్లిపోయాడు.
———————————————————————–
కుక్కనోట్లోచెయ్యి!
ఒక సేల్స్‌మాన్ కొత్తరకం బిస్కెట్ ప్యాకెట్లని అమ్మడానికి ఒక ఇంటి ముందు ఆగాడు.
ఆ ఇంట్లో కుక్క వచ్చి ఆ సేల్స్‌మాన్ పైకి దూకి అతని చేతిని నోటితో పట్టుకుంది.
ఇంటి యజమానురాలు వచ్చి సేల్స్‌మాన్‌ని చూసి “నీకెంత ధైర్యం మా అమాయకమైన కుక్క నోట్లో నీ చెయ్యి పెడతావా?” అంది.