రేవంత్ రెడ్డి దరిద్రుడు!
తాను వైద్య వృత్తి చేయలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను వైద్యవృత్తి చేయనట్లుగా, నావద్ద వైద్య డిగ్రీలేనట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, లేకుంటే నువ్వు తప్పుకుంటావా ?అని రేవంత్‌రెడ్డికి బహింగ సవాలు విసిరారు. రాష్ట్ర వైద్యారోగ్యమంత్రి మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోలాగ నకిలీ సర్టిఫికేట్‌తో మంత్రి పదవిలో కొనసాగుతున్నారని ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈయన చెప్పగానే ఎలాంటి నిర్ధారణలు లేకుండా తగుదునమ్మా.. అంటూ ఆంధ్రజ్యోతి, […]
BY sarvi9 Aug 2015 1:14 AM GMT
X
sarvi Updated On: 9 Aug 2015 1:14 AM GMT
తాను వైద్య వృత్తి చేయలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను వైద్యవృత్తి చేయనట్లుగా, నావద్ద వైద్య డిగ్రీలేనట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, లేకుంటే నువ్వు తప్పుకుంటావా ?అని రేవంత్‌రెడ్డికి బహింగ సవాలు విసిరారు. రాష్ట్ర వైద్యారోగ్యమంత్రి మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలోలాగ నకిలీ సర్టిఫికేట్‌తో మంత్రి పదవిలో కొనసాగుతున్నారని ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈయన చెప్పగానే ఎలాంటి నిర్ధారణలు లేకుండా తగుదునమ్మా.. అంటూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానళ్లు ఆ వార్తను ఎలా ప్రసారం చేస్తారని విరుచుకుపడ్డారు. శనివారం సాయంత్రం ఆయన టీఆర్ ఎస్ ఎల్‌పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కర్ణాటకలో చేసిన వైద్య డిగ్రీ, కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన పట్టాలను మీడియాకు చూపించారు. ఈ దరిద్రుడు (రేవంత్‌రెడ్డి) ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి నోట్లకట్టలతో దొరికిపోయిన సంగతి లోకమంతా తెలుసు. అతని చరిత్ర జనానికి తెలుసు. తప్పులు చేసి కొడంగల్‌కు పరిమితమయ్యాడు. ఇతనా నాపై ఆరోపణలు చేసేదని ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతికి చేతనైతే అడ్డదారిలో వేలకోట్లు సంపాదించిన రేవంత్‌రెడ్డి ఆస్తులపై నిఘా కథనాలు చేయాలని సూచించారు. తనపై నిరాధారణ ఆరోపణలు చేసిన ఆంధ్రజ్యోతి, రేవంత్‌రెడ్డిలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story