గద్దర్ వర్సెస్ టీఆర్ఎస్
ప్రజా గాయకుడు గద్దర్‌ను వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక బరిలోకి దింపాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, నూతన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా గద్దర్‌కు, అధికార పార్టీ టీఆర్ఎస్‌కు మధ్యా భేదాభిప్రాయాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రజాసంఘాల తర్వాత గద్దర్‌ను టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోటీ చేయించాలని, తద్వారా సీఎంను దెబ్బతీయాలని టీ.కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రెండు దశాబ్ధాల పాటు తెలంగాణ కోసం సామాజిక ఉద్యమాలను నడిపిన గద్దర్‌కు ప్రజల్లో మంచి ఆదరణ […]
BY sarvi8 Aug 2015 6:38 PM IST
X
sarvi Updated On: 9 Aug 2015 9:12 AM IST
ప్రజా గాయకుడు గద్దర్‌ను వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక బరిలోకి దింపాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, నూతన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా గద్దర్‌కు, అధికార పార్టీ టీఆర్ఎస్‌కు మధ్యా భేదాభిప్రాయాలు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని ప్రజాసంఘాల తర్వాత గద్దర్‌ను టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోటీ చేయించాలని, తద్వారా సీఎంను దెబ్బతీయాలని టీ.కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రెండు దశాబ్ధాల పాటు తెలంగాణ కోసం సామాజిక ఉద్యమాలను నడిపిన గద్దర్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలున్న ఆయనను ప్రజలు ఆదరిస్తారని టీ. కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే గద్దర్‌ను ఎన్నికల రంగంలోకి దింపి తెరవెనుక మద్దతు ప్రకటించాలని భావిస్తోంది. మరి టీ. కాంగ్రెస్ ఆశలను గద్దర్ నెరవేరుస్తాడా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
Next Story