తెలంగాణలో రోగాల స్వైర విహారం
తెలంగాణ గ్రామాలు జ్వరాలు, జబ్బులతో నీరసించి పోయాయి. మున్సిపల్ కార్మకుల సమ్మె ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఊర్ల నిండా చెత్తా చెదారాలు పేరుకు పోవడంతో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలాయి. వీటితో పాటు అతిసార, కామెర్లు, టైఫాయిడ్, చికెన్‌గున్యా వంటి వ్యాధులు విజృంభించాయి. దీంతో పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా ఆస్పత్రులు కిక్కిరిసి పోతున్నాయి. గత ఏడాది అధికారికంగా 1338 మలేరియా, 56 డెంగ్యూ కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది తొలి […]
BY sarvi9 Aug 2015 8:20 AM IST
X
sarvi Updated On: 9 Aug 2015 8:20 AM IST
తెలంగాణ గ్రామాలు జ్వరాలు, జబ్బులతో నీరసించి పోయాయి. మున్సిపల్ కార్మకుల సమ్మె ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఊర్ల నిండా చెత్తా చెదారాలు పేరుకు పోవడంతో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలాయి. వీటితో పాటు అతిసార, కామెర్లు, టైఫాయిడ్, చికెన్‌గున్యా వంటి వ్యాధులు విజృంభించాయి. దీంతో పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా ఆస్పత్రులు కిక్కిరిసి పోతున్నాయి. గత ఏడాది అధికారికంగా 1338 మలేరియా, 56 డెంగ్యూ కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది తొలి అర్థభాగంలోనే 1268 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఒక వ్యక్తి మలేరియాతో మరణించాడు. 26 చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా వీటి సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. విషజ్వరాలతో వస్తున్న వారితో ప్రైవేట్ ఆస్పత్రులు నిండి పోయాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో సుమారు 2వేల గ్రామాలు మలేరియా పీడిత గ్రామాలుగా ప్రభుత్వం ఇదివరలోనే గుర్తించింది. అందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పైగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా శుభ్రత లోపించింది. దీంతో విషజ్వరాలు విజృంభించాయి.పరిస్థితి అదుపుతప్పుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీనిపై గ్రామాల్లోని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చస్తున్నారు. దోమల నివారణకు తీసుకునే చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత కూడా తీవ్రంగా ఉందని ఆరోపిస్తున్నారు.
Next Story