Telugu Global
Cinema & Entertainment

బాహుబలిలో పేర్లు కూడా వాడేస్తున్నారు..

బాహుబలి సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఆలిండియా లెవెల్లో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. భాషలతో సంబంధం లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆడింది. సినిమా టైటిల్ తో పాటు అందులోని పాత్రల పేర్లు కూడా బాగా పాపులర్ అయిపోయాయి. బాహుబలి, భళ్లాలదేవ, దేవసేన, కట్టప్ప, కాలకేయ లాంటి పాత్రల పేర్లు భాషలతో సంబంధం లేకుండా పాపులర్ అయిపోయాయి. ఇప్పుడీ పాత్రల పేరులతోనే సినిమాలు రావడం మొదలయ్యాయి. గతంలో సూపర్ హిట్ పాటల […]

బాహుబలిలో పేర్లు కూడా వాడేస్తున్నారు..
X
బాహుబలి సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఆలిండియా లెవెల్లో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. భాషలతో సంబంధం లేకుండా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆడింది. సినిమా టైటిల్ తో పాటు అందులోని పాత్రల పేర్లు కూడా బాగా పాపులర్ అయిపోయాయి. బాహుబలి, భళ్లాలదేవ, దేవసేన, కట్టప్ప, కాలకేయ లాంటి పాత్రల పేర్లు భాషలతో సంబంధం లేకుండా పాపులర్ అయిపోయాయి. ఇప్పుడీ పాత్రల పేరులతోనే సినిమాలు రావడం మొదలయ్యాయి. గతంలో సూపర్ హిట్ పాటల టైటిల్స్ తో సినిమాలు వచ్చినట్టు ఇప్పుడు బాహుబలి సినిమాలోని పాత్రల పేర్లతో సినిమాలు రావడం మొదలయ్యాయి. తమిళ్ లో హిట్టయిన ఓ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేయాలని నిర్ణయించాడు ఓ టాలీవుడ్ ఛోటా నిర్మాత. సినిమాకు టైటిల్ తోనే ప్రచారం కల్పించాలనుకున్నాడు. అందుకే ఏకంగా ఆ డబ్బింగ్ సినిమాకు భళ్లాలదేవ అని పేరుపెట్టేశాడు. విమల్-బిందుమాధవి హీరోహీరోయిన్లుగా నటించి దేశింగు రాజా అనే తమిళ సినిమా త్వరలోనే తెలుగునాట భళ్లాలదేవగా రానుంది. చూస్తుంటే త్వరలోనే కాలకేయ, కట్టప్ప, దేవసేన పేర్లతో కూడా సినిమాలు వచ్చేలా ఉన్నాయి.
First Published:  9 Aug 2015 12:31 AM IST
Next Story