ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
తెలంగాణలో ముస్లింల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా వారికి 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యులు డిజి. నర్సింహారావు డిమాండ్ చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్ అమలు చేయాలని కోరుతూ సీపీఎం చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజుకు చేరింది. ముస్లింలకు నాలుగు నెలల్లో రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. ముస్లిం జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తే ప్రతి కుటుంబానికి […]
BY sarvi8 Aug 2015 6:42 PM IST

X
sarvi Updated On: 9 Aug 2015 9:35 AM IST
తెలంగాణలో ముస్లింల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లుగా వారికి 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యులు డిజి. నర్సింహారావు డిమాండ్ చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్ అమలు చేయాలని కోరుతూ సీపీఎం చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజుకు చేరింది. ముస్లింలకు నాలుగు నెలల్లో రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. ముస్లిం జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తే ప్రతి కుటుంబానికి రూ. 50 వేలు కేటాయించవచ్చని ఆయన అన్నారు. ముస్లింలకు బ్యాంకులు రుణాలు నిరాకరించడం సరికాదని ఆయన అన్నారు. ఈ బస్సు యాత్ర శనివారం నగరంలోకి ప్రవేశించగా చార్మినార్‌లో ఈ బస్సుయాత్రను విద్యావేత్త ఇలియాస్ తాహెర్ ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర జంట నగరాల్లో మూడు రోజుల పాటు సాగుతుంది. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ ముస్లింలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని, వారంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
Next Story