భారత్ ఇక నా దేశం: అద్నాన్ సమీ
భారత గడ్డపై సమీ శాశ్వతంగా ఉండిపోవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో అద్నాన్ సమీ పొంగిపోతున్నాడు. తన విన్నపాన్ని భారత ప్రభుత్వం మన్నించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..పౌరసత్వం కోసం ఎదురు చూస్తానని తెలిపారు. అంతు లేని ప్రేమ, ప్రశంస, ఆప్యాయతలు భారత్ నుంచి పొందానని, ప్రపంచం మొత్తానికి భారత కళాకారుడి గానే తాను పరిచయం అయ్యానని అన్నాడు ఈ గాయకుడు. ఏ దేశ పౌరసత్వం అయినా తాను పొందగలనని, కానీ తన మనసంతా భారత్‌లోనే ఉంటుందని..అందుకే భారత బిడ్డగా ఉండిపోవాలని […]
BY sarvi7 Aug 2015 1:15 PM GMT
X
sarvi Updated On: 8 Aug 2015 6:05 AM GMT
భారత గడ్డపై సమీ శాశ్వతంగా ఉండిపోవడానికి ప్రభుత్వం అనుమతించింది. దీంతో అద్నాన్ సమీ పొంగిపోతున్నాడు. తన విన్నపాన్ని భారత ప్రభుత్వం మన్నించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ..పౌరసత్వం కోసం ఎదురు చూస్తానని తెలిపారు. అంతు లేని ప్రేమ, ప్రశంస, ఆప్యాయతలు భారత్ నుంచి పొందానని, ప్రపంచం మొత్తానికి భారత కళాకారుడి గానే తాను పరిచయం అయ్యానని అన్నాడు ఈ గాయకుడు. ఏ దేశ పౌరసత్వం అయినా తాను పొందగలనని, కానీ తన మనసంతా భారత్‌లోనే ఉంటుందని..అందుకే భారత బిడ్డగా ఉండిపోవాలని కోరుకున్నానని అద్నాన్ సమీ చెప్పాడు. కాగా తాను పాక్ పౌరసత్వం వదులుకుంటున్నానని సమీ ప్రకటించడంపై స్వదేశంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story