సీఎంను కలవడానికి వస్తే అరెస్టులా... విపక్షాల ధ్వజం
కార్మికుల సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రిని అభ్యర్ధించడానికి వస్తే, అక్రమంగా అరెస్ట్ చేయిస్తారా? ప‌్రజాస్వామ్యమంటే ఇదేనా ? అని విపక్షనేతలు ప్రశ్నించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రిని కలవడానికి లెఫ్ట్ పార్టీల నేతలు చాడా వెంకటరెడ్డి, రవీంద్రకుమార్, తమ్మినేని వీరభద్రం, న్యూ డెమక్రసీ నేతలు వెంకట్రామయ్య, గోవర్థన్, భూతం వీరన్న, ఎమ్‌డి గౌస్, జానకీరాములు, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, వైసీపీ నేతలు కొండా రాఘవరెడ్డి తదితరులు శుక్రవారం సచివాలయానికి వెళ్లారు. అయితే, ముఖ్యమంత్రి వారిని […]
BY sarvi8 Aug 2015 5:40 AM IST
X
sarvi Updated On: 8 Aug 2015 6:15 AM IST
కార్మికుల సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రిని అభ్యర్ధించడానికి వస్తే, అక్రమంగా అరెస్ట్ చేయిస్తారా? ప‌్రజాస్వామ్యమంటే ఇదేనా ? అని విపక్షనేతలు ప్రశ్నించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రిని కలవడానికి లెఫ్ట్ పార్టీల నేతలు చాడా వెంకటరెడ్డి, రవీంద్రకుమార్, తమ్మినేని వీరభద్రం, న్యూ డెమక్రసీ నేతలు వెంకట్రామయ్య, గోవర్థన్, భూతం వీరన్న, ఎమ్‌డి గౌస్, జానకీరాములు, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, వైసీపీ నేతలు కొండా రాఘవరెడ్డి తదితరులు శుక్రవారం సచివాలయానికి వెళ్లారు. అయితే, ముఖ్యమంత్రి వారిని కలిసేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా విపక్షనేతలు సీఎం కార్యాలయం సమత బ్లాక్ వద్ద బైఠాయించారు. దీంతో పోలీసులు విపక్షనేతలను అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ తీరుపట్ల విపక్షనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం ఖూని చేస్తున్నాడని, ఉద్యమనేతగా ఎదిగిన కేసీఆర్ నిరంకుశంగా పరిపాలిస్తున్నారని విమర్శించారు. కాగా పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం ఘట్‌కేసర్‌లో కార్మికులు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షలను బలవంతంగా భగ్నం చేసింది. ప్రభుత్వం మంత్రి కేటీఆర్ పర్యటనలో మరో అడుగు ముందుకేసింది. మంచాల మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రిని కలిసేందుకు వెళ్లిన నేతలను, కార్మికులను ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో పోలీసులు నిర్భంధించారు. పోలీసుల తీరుపట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికుల దీక్షలకు ప్రజాసంఘాల సంఘీభావం
కనీస వేతనాలను చెల్లించాల్సిందిగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరాహారదీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్మికుల దీక్షలకు శుక్రవారం వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రజాసంఘాల నేతలతో పాటు ప్రొఫెసర్ కోదండరాం కూడా సంఘీభావం ప్రకటించారు. పలుచోట్ల కార్మికులు స్థానిక నేతలకు వినతిపత్రాలు అందచేశారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా కార్మికులు విజ్ఞప్తి చేశారు.
Next Story