జయతో ప్రధాని లంచ్‌పే మంతనాలు!
ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే బలం. దీంతో కేంద్రప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలకు పార్లమెంటు ఆమోదం లభించడం లేదు. పైగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అధికారపక్షానికి ప్రతిపక్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఐపీఎల్ స్కాం నిందితుడు లలిత్ మోడీ వ్యవహారంతో పార్లమెంటు అట్టుడికి పోతోంది. కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రమంత్రి సుష్మా, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజే, మహారాష్ట్ర […]
BY sarvi8 Aug 2015 9:37 AM IST
X
sarvi Updated On: 8 Aug 2015 9:37 AM IST
ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే బలం. దీంతో కేంద్రప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలకు పార్లమెంటు ఆమోదం లభించడం లేదు. పైగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అధికారపక్షానికి ప్రతిపక్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఐపీఎల్ స్కాం నిందితుడు లలిత్ మోడీ వ్యవహారంతో పార్లమెంటు అట్టుడికి పోతోంది. కాంగ్రెస్‌తో సహా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రమంత్రి సుష్మా, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజే, మహారాష్ట్ర సీఎం శివరాజ్ సింఘ్ చౌహాన్‌ల రాజీనామాకు పట్టుబడుతున్నాయి. కేంద్రమంత్రి సుష్మా ఈ వివాదంపై పార్లమెంటులో ప్రకటన చేసినప్పటికీ ప్రతిపక్షాలు తమ దాడిని ఆపలేదు. పైగా కేంద్ర మంత్రులు దొంగల్లా వ్యవహరించి ఇప్పుడు నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె తనయుడు రాహుల్ విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలతో సభలో డీలా పడిన ప్రధాని పరిస్థితిని చక్కదిద్దే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సంఖ్యలో 37 మంది సభ్యులు 11 మంది రాజ్యసభ సభ్యులను కలిగిన అన్నాడీఎంకె అధినేత్రి జయలలితను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే శుక్రవారం చెన్నయిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించిన తరువాత ఆయన జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌కు వెళ్లారు. ప్రధానికి స్వయంగా జయలలితే ఎదురేగి స్వాగతం పలకడంతోపాటు ఘనంగా ఆతిథ్యమిచ్చారు. ఈ భేటీలో వారిరువురూ పలు విషయాలపై చర్చించారు. పార్లమెంటులో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంబన తొలగించడానికి బీజేపీకి అన్నాడీఎంకె సహకరించాలని ప్రధాని ఆమెను కోరారు. వచ్చే వారం లోక్‌సభ ముందుకు రానున్న భూ సేకరణ బిల్లుకు కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా అన్నాడీఎంకె అధినేత్రిని ప్రధాని కోరినట్లు సమాచారం. జయలలిత కూడా తమిళనాడు ప్రయోజనాల కోసం పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారని, ఇందులో ముఖ్యంగా కేరళ, కర్ణాటకలతో రాష్ట్రం ఎదుర్కొంటున్న జల వివాదాల్ని ఆమె ప్రస్తావించగా తప్పకుండా కేంద్రం నుంచి సాయం చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
Next Story