ఎంపీల్లో ఒకరిద్దరు ఉగ్రవాదులు: సాధ్వి ప్రాచి
విశ్వహిందూ పరిషత్ ఫైర్‌బ్రాండ్ సాధ్వి ప్రాచి మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులోని ఎంపీల్లో కూడా ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారని ఆమె గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తాయి. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకుబ్ మెమెన్‌కు ఉరిశిక్ష అమలును వ్యతిరేకించిన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఆమె ఈ విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారు కూడా ఉగ్రవాదులేనని ఆమె వ్యాఖ్యానించారు. ఉధంపూర్‌లో భద్రతా బలగాలకు చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్‌ను హిందూ సంస్థలకు […]
BY sarvi6 Aug 2015 6:37 PM IST
X
sarvi Updated On: 7 Aug 2015 5:55 AM IST
విశ్వహిందూ పరిషత్ ఫైర్‌బ్రాండ్ సాధ్వి ప్రాచి మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులోని ఎంపీల్లో కూడా ఒకరిద్దరు ఉగ్రవాదులున్నారని ఆమె గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తాయి. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నేరస్తుడు యాకుబ్ మెమెన్‌కు ఉరిశిక్ష అమలును వ్యతిరేకించిన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ఆమె ఈ విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారు కూడా ఉగ్రవాదులేనని ఆమె వ్యాఖ్యానించారు. ఉధంపూర్‌లో భద్రతా బలగాలకు చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్‌ను హిందూ సంస్థలకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. సాధ్వి వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీలపై ఆమె చేసిన వ్యాఖ్యలు పార్లమెంటుతోపాటు రాజ్యాంగాన్ని కూడా అవమానించాయని ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపి తివారీ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కోరారు.
Next Story