నెట్లో హల్చల్ చేస్తున్న రాథే'మా' డ్యాన్స్ వీడియోలు!
చేతిలో ఎప్పుడూ త్రిశూలంతో భక్తులను పరవశింపజేసే ‘రాధే మా’ మినీ స్కర్ట్ వేసుకుని చేసిన వీడియోలు ఇపుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ముంబాయిలోని ఆమె ఆశ్రమం ఎప్పుడూ భక్తజన పరివారంతో కళకళలాడుతూ ఉంటుంది. భక్తులు ఆమెకు తరచూ పుష్పాభిషేకం చేస్తూ ఊరేగిస్తూ ఉంటారు. ఆమెతో కూర్చుని భజనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఉంటారు. రాథేమాకు పాదాభివందనం చేస్తూ తమ భక్తప్రపత్తులు చాటుకుంటారు. అకస్మాత్తుగా ఆమెకు ఏమైందో ఏమో సినిమా ఐటం గర్ల్ మాదిరిగా మినీ స్కర్ట్స్ వేసుకుని […]
చేతిలో ఎప్పుడూ త్రిశూలంతో భక్తులను పరవశింపజేసే ‘రాధే మా’ మినీ స్కర్ట్ వేసుకుని చేసిన వీడియోలు ఇపుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ముంబాయిలోని ఆమె ఆశ్రమం ఎప్పుడూ భక్తజన పరివారంతో కళకళలాడుతూ ఉంటుంది. భక్తులు ఆమెకు తరచూ పుష్పాభిషేకం చేస్తూ ఊరేగిస్తూ ఉంటారు. ఆమెతో కూర్చుని భజనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఉంటారు. రాథేమాకు పాదాభివందనం చేస్తూ తమ భక్తప్రపత్తులు చాటుకుంటారు. అకస్మాత్తుగా ఆమెకు ఏమైందో ఏమో సినిమా ఐటం గర్ల్ మాదిరిగా మినీ స్కర్ట్స్ వేసుకుని డ్యాన్సులు చేస్తూ వీడియోలో కనిపించడం ఇపుడు ఆమెపై ఉన్న సదభిప్రాయాన్ని నాశనం చేస్తోంది.
సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే చూస్తుంటారు బాధితులు. అనూహ్యంగా రాథేమాపై ఇపుడు వరకట్నం కేసు నమోదు అయ్యింది. ఈ ఒక్కటే కాదు… వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెన అరెస్ట్ చేసి విచారించాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. భక్తి ముసుగులో రాథేమా ఎన్నో అక్రమ వ్యాపారాలు కూడా చేస్తుందని వినికిడి. మొదటిసారిగా నక్కీ అనే మహిళ ఈ వరకట్నం కేసు వేసింది. కోటి రూపాయల బంగారాన్ని వరకట్నంగా ఇచ్చినప్పటికీ తన అత్తమామలు ఇంకా కట్నం కావాలని వేధిస్తున్నారని, ఇదంతా రాథేమా ప్రోద్బలంతోనే జరుగుతుందని నక్కి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు రాథేమా ఖండిస్తున్నారు. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె అంటున్నారు.
నిజానికి రాథేమా పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామం. తల్లిదండ్రులు ఆమెకు మోహన్‌సింగ్ అనే యువకుడితో వివాహం కూడా చేశారు. ఈమె ఎప్పుడూ శివుడి ఆరాధనలో తేలిపోతుండేది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడే ఈ కుటుంబం నుంచి రాథేమా అకస్మాత్తుగా ముంబాయి వెళ్ళిపోయి రాథేమాగా మారిపోయింది.