విభజించి ఇప్పుడెందుకు దొంగేడుపు తల్లీ: కావూరి
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం రాష్ట్రాన్ని సోనియా గాంధీ అడ్డంగా చీల్చి ఇప్పుడేమో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని కావూరి, కన్నామండిపడ్డారు.ప్రస్తుతం ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతోంది కూడా కాంగ్రెస్ పార్టీనే అని… ప్రత్యేక హోదా కోరుతున్న ఇతర రాష్ట్రాలను ఆ పార్టీ రెచ్చగొడుతోందని కావూరి దుయ్యబట్టారు. విభజన […]
BY sarvi6 Aug 2015 6:46 PM IST
X
sarvi Updated On: 7 Aug 2015 7:33 AM IST
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం రాష్ట్రాన్ని సోనియా గాంధీ అడ్డంగా చీల్చి ఇప్పుడేమో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని కావూరి, కన్నామండిపడ్డారు.ప్రస్తుతం ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతోంది కూడా కాంగ్రెస్ పార్టీనే అని… ప్రత్యేక హోదా కోరుతున్న ఇతర రాష్ట్రాలను ఆ పార్టీ రెచ్చగొడుతోందని కావూరి దుయ్యబట్టారు. విభజన చట్టం అమలు చేయడానికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం గురించి మాట్లాడకుండా… రావాల్సిన నిధుల గురించే టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
Next Story