Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 167

మర్చిపో నరాల జబ్బున్న పేషెంట్‌: డాక్టర్‌! నేను తరచుగా నన్ను నేను చంపుకుంటున్నట్లు అనుభూతి చెందుతాను. డాక్టర్‌: దిగులు పడకు! ఆ విషయం నాకు వదిలెయ్‌! ————————————————————– పరిష్కారం “ఈ సమస్య మీ ఇద్దరిది. మీరిద్దరే కోర్టుతో సంబంధం లేకుండా బయటే ఎందుకు పరిష్కరించుకోకూడదు?” అన్నాడు జడ్జి. ముద్దాయి “మేమిద్దరం బయట ఆ ప్రయత్నంలోనే ఉంటే పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు సార్” అన్నాడు. ————————————————————– సైకిల్‌ కిక్కు ఓ సైకిల్‌ మీద ఇద్దరు స్నేహితులు వెళుతున్నారు. తొక్కుతున్న […]

మర్చిపో
నరాల జబ్బున్న పేషెంట్‌: డాక్టర్‌! నేను తరచుగా నన్ను నేను చంపుకుంటున్నట్లు అనుభూతి చెందుతాను.
డాక్టర్‌: దిగులు పడకు! ఆ విషయం నాకు వదిలెయ్‌!
————————————————————–
పరిష్కారం
“ఈ సమస్య మీ ఇద్దరిది. మీరిద్దరే కోర్టుతో సంబంధం లేకుండా బయటే ఎందుకు పరిష్కరించుకోకూడదు?” అన్నాడు జడ్జి.
ముద్దాయి “మేమిద్దరం బయట ఆ ప్రయత్నంలోనే ఉంటే పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు సార్” అన్నాడు.
————————————————————–
సైకిల్‌ కిక్కు
ఓ సైకిల్‌ మీద ఇద్దరు స్నేహితులు వెళుతున్నారు. తొక్కుతున్న వాడు ఇలా అన్నాడు. “అరే! నా సైకిల్‌ ఎందుకిలా వంకర టింకరగా పోతోంది!”
రెండో వాడిలా జవాబిచ్చాడు “సైకిల్‌ మీద విస్కీ బాటిల్‌ పెట్టుకుని తొక్కితే అలాగే ఉంటుంది మరి!”
————————————————————–
తాజాగా
కూరగాయలమ్మే అతనికి కొడుకుపుట్టాడు. ఆ సంగతి తెలిసిన ఓ కొనుగోలుదారుడు “నీ కొడుకెలా ఉన్నాడయ్యా!” అని అడిగాడు.
“చాలా తాజాగా ఉన్నాడయ్యా” అన్నాడు కూరగాయలు అమ్మే అతను.

First Published:  6 Aug 2015 6:33 PM IST
Next Story