Telugu Global
Others

హిమబిందు కేసులో హైకోర్టుకు అప్పీల్‌

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన బ్యాంకు మేనేజర్‌ భార్య హిమబిందు కేసులో హైకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీనికి సంబంధించి తగిన వివరాలతో అప్పీల్‌ చేయాల్సిందిగా అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఈ మేరకు అప్పీలుకు వీలు కలిగించే విధంగా జీవో ఆర్‌.టి.నంబర్‌ 911ను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. హైకోర్టులో ఈ కేసుపై అప్పీల్‌ చేయాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టులో ఈ కేసును కొట్టివేయడంతో ఈ తీర్పు న్యాయశాస్త్ర […]

హిమబిందు కేసులో హైకోర్టుకు అప్పీల్‌
X

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన బ్యాంకు మేనేజర్‌ భార్య హిమబిందు కేసులో హైకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీనికి సంబంధించి తగిన వివరాలతో అప్పీల్‌ చేయాల్సిందిగా అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఈ మేరకు అప్పీలుకు వీలు కలిగించే విధంగా జీవో ఆర్‌.టి.నంబర్‌ 911ను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. హైకోర్టులో ఈ కేసుపై అప్పీల్‌ చేయాలంటూ అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టులో ఈ కేసును కొట్టివేయడంతో ఈ తీర్పు న్యాయశాస్త్ర విరుద్ధమని, హైకోర్టులో అప్పీలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కృష్ణాజిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ బైరా రామకోటేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రతిపాదనలు పంపారు. వీటిని స్వీకరించిన ప్రభుత్వం క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత జీవో ఆర్‌.టి.నంబర్‌. 911ను జారీ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేయాల్సిందిగా అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఈకేసులో ప్రాసిక్యూషన్‌ సరైన సాక్ష్యాధారాలు చూపడంలో విఫలమైందని ఎత్తి చూపుతూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రతివాదులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవన్న కారణాలతో న్యాయమూర్తి ఈ కేసును కొట్టి వేశారు. హిమబిందు అత్యాచారానికి గురైనట్టు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా ధ్రువీకరించింది. అయితే దీన్ని కూడా పోలీసులు నిరూపించలేకపోయారు. ఈ కేసులో కావాలనే పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించడం నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో కేసును రీ ఓపెన్‌ చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్‌ జనరల్‌కు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

First Published:  7 Aug 2015 5:04 PM IST
Next Story