ఏపీ జీవో 38కు హైకోర్టులో చుక్కెదురు
డీఎస్సీ 2014 కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 38 చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో 38ను జారీ చేసింది. దీనిపై అభ్యంతరం చెప్పిన పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలిపారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం జీవో 38 చెల్లదని, అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించే విధానంలో […]
BY sarvi6 Aug 2015 6:44 PM IST
X
sarvi Updated On: 7 Aug 2015 7:30 AM IST
డీఎస్సీ 2014 కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 38 చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహిస్తూ ప్రభుత్వం జీవో 38ను జారీ చేసింది. దీనిపై అభ్యంతరం చెప్పిన పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలిపారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం జీవో 38 చెల్లదని, అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించే విధానంలో పూర్వ స్థితినే కొనసాగించాలని తీర్పు ఇచ్చింది.
Next Story