గాలికి 35వేల ప్రాణాలు బలి
స్వచ్ఛమైన గాలి ఎక్కడా లేని పరిస్థితి! మన దేశంలో ప్రశాంతంగా గాలి కూడా పీల్చలేని దుస్థితి! గత పదేళ్లలో వాయు కాలుష్యానికి 35వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వాయు కాలుష్య మరణాలను ఇంతవరకూ తోసిపుచ్చుతూ వచ్చిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తాజాగా వాస్తవాలను అంగీకరించింది. దశాబ్దకాలంలో 2.6 కోట్ల వాయు సంబంధ అనారోగ్య కేసులు నమోదయ్యాయని పార్లమెంటుకు వెల్లడించింది. పెరుగుతున్న వాయి కాలుష్యంతో నిత్యం వేలాది ఆస్తమా కేసులు రిపోర్టు అవుతున్నాయని […]
స్వచ్ఛమైన గాలి ఎక్కడా లేని పరిస్థితి! మన దేశంలో ప్రశాంతంగా గాలి కూడా పీల్చలేని దుస్థితి! గత పదేళ్లలో వాయు కాలుష్యానికి 35వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వాయు కాలుష్య మరణాలను ఇంతవరకూ తోసిపుచ్చుతూ వచ్చిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తాజాగా వాస్తవాలను అంగీకరించింది. దశాబ్దకాలంలో 2.6 కోట్ల వాయు సంబంధ అనారోగ్య కేసులు నమోదయ్యాయని పార్లమెంటుకు వెల్లడించింది. పెరుగుతున్న వాయి కాలుష్యంతో నిత్యం వేలాది ఆస్తమా కేసులు రిపోర్టు అవుతున్నాయని పర్యావరణమంత్రి ప్రకాష్ జవదేకర్ వివరించారు.
ఢిల్లీలో రోజుకు 80 మంది మృతి:
వాయుకాలుష్యం కారణంగా చైనా, ఇండియాల్లో అత్యధిక మరణాలు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఒక్క ఢిల్లీలోనే రోజుకు 80మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. హై బీపీ, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, పొగాకు, పౌష్టికాహార లోపాల తర్వాత భారత్‌లో మరణాలకు ఐదో కారణం వాయుకాలుష్యమేనని తేల్చింది. వాయి కాలుష్యానికి జనం రాలిపోతున్న నిజాన్ని ఆలస్యంగానైనా భారత ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషమంటూనే.. ప్రభుత్వ లెక్కలు వాస్తవాలకంటే చాలా తక్కువని పేర్కొంది.