తిరుపతి లడ్డూకు 300ల సంవత్సరాలు
ప్రసాదంగా ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడం ఒక్క తిరుపతి లడ్డూకే చెల్లింది. తిరుపతి వెళితే శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో, లడ్డూ తేవడం అంతే ముఖ్యంగా భక్తులు భావిస్తారు. వీఐపీ దర్శనాల కోసం ఎగబడుతూనే, అదనపు లడ్డూలు సంపాదించడానికి భక్తులు పైరవీలు కూడా చేస్తారంటే లడ్డూ విశిష్టత మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తిరుపతి లడ్డూ తయారీ ప్రారంభమై మూడు వందల ఏళ్లు పూర్తి కావడం అసలు విశేషం. ఆగస్టు 2, 1715 నుంచి ప్రారంభమైనట్టు […]
BY Pragnadhar Reddy6 Aug 2015 11:15 AM IST
X
Pragnadhar Reddy Updated On: 6 Aug 2015 12:02 PM IST
ప్రసాదంగా ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడం ఒక్క తిరుపతి లడ్డూకే చెల్లింది. తిరుపతి వెళితే శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో, లడ్డూ తేవడం అంతే ముఖ్యంగా భక్తులు భావిస్తారు. వీఐపీ దర్శనాల కోసం ఎగబడుతూనే, అదనపు లడ్డూలు సంపాదించడానికి భక్తులు పైరవీలు కూడా చేస్తారంటే లడ్డూ విశిష్టత మనం అర్థం చేసుకోవచ్చు. అయితే తిరుపతి లడ్డూ తయారీ ప్రారంభమై మూడు వందల ఏళ్లు పూర్తి కావడం అసలు విశేషం. ఆగస్టు 2, 1715 నుంచి ప్రారంభమైనట్టు ఆధారాలున్నాయి. శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు, ద్రాక్ష తదితర ఎన్నో పదార్థాలను నియమిత పరిమాణం మేరకు కలిపి లడ్డూలను తయారు చేస్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రతిఒక్కరూ ఈ లడ్డూలను ప్రసాదంగా స్వీకరిస్తారు.
ఏటేటా పెరుగుతున్న లడ్డూల విక్రయం
టీటీడీ లెక్కల ప్రకారం 2014లో మొత్తం 9 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 2014-15లో ప్రసాదాల విక్రయం వల్ల టీటీడీకి రూ. 2,401 కోట్ల ఆదాయం లభించింది. లడ్డూ తయారీ కేంద్రంలో 270 మంది వంటవారు సహా మొత్తం 620 మంది పని చేస్తుంటారు. ఈ లడ్డూలను తయారు చేయాడానికి కిచెన్ ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశారు. నియమనిష్టలతో నిపుణులు ఈ లడ్డూలను తయారు చేస్తుంటారు. ఇక్కడ రోజుకు 8 లక్షల వరకూ లడ్డూలు తయారవుతుంటాయి. లడ్డూతో పాటు శ్రీవారి కోసం పలు రకాల నైవేద్యాలను తయారు చేస్తుంటారు. వీటిల్లో వడలు, దోశలు, పులిహోర, పరమాన్నం, దద్దోజనం, జిలేబీ వంటి ఎన్నో రకాలుంటాయి. అయితే, లడ్డూలు మినహా మరే ప్రసాదాలూ సామాన్య భక్తులకు అంతగా అందుబాటులో ఉండవు. అదే లడ్డూ మహత్యం. భక్తులు కూడా లడ్డూని తప్పించి మరే ప్రసాదాన్ని అడగరు.
తిరుపతి లడ్డూపై పేటెంట్స్ రైట్స్
తిరుపతి లడ్డూకు పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) స్టేటస్ ను జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014లో ఇచ్చింది. మూడు వందల ఏళ్లుగా వన్నెతగ్గని ప్రసాదంగా, తిరుపతి అంటే కొండగుర్తుగా మారిన తిరుపతి లడ్డూ ఎన్నో రికార్డులను సాధించడంతోపాటు టీటీడీకి ప్రధాన వనరుగా మారింది.
Next Story