మెట్రో మార్గంలో ఫ్లై ఓవర్లు
రూ. 20 వేల కోట్లతో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం, జిహెచ్ఎంసి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఉమ్మడి రాష్ట్రం హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే రూ.14,132 కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు 2017 నాటికి పూర్తవుతుందని అంచనా. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మరో సమగ్ర రోడ్డు పథకం (ఎస్ఆర్‌డిపి)లో భాగంగా మల్టీ లెవల్ ఫ్లై […]
BY sarvi5 Aug 2015 6:42 PM IST
sarvi Updated On: 6 Aug 2015 9:17 AM IST
రూ. 20 వేల కోట్లతో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం, జిహెచ్ఎంసి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఉమ్మడి రాష్ట్రం హయాంలో మెట్రోరైలు ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే రూ.14,132 కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు 2017 నాటికి పూర్తవుతుందని అంచనా. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మరో సమగ్ర రోడ్డు పథకం (ఎస్ఆర్‌డిపి)లో భాగంగా మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు నిర్మించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులను దోచుకోవడానికే అర్ధంపర్ధం లేని ఇలాంటి పథకాలను ప్రవేశపెడుతుందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story