అంత ఆరాటం ఎందుకు రామ్మోహనా?!
మనిషికి కంగారు సహజం! కానీ టీడీపీ నేతలకు విపరీతమైన ఆరాటం! క్రెడిట్ అంతా తామే కొట్టేయాలన్న కక్కుర్తి! అసలు ఈ పసుపు మనుషులు మారరేమో అనిపిస్తుంది. లేకపోతే మరేమిటి? తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలు ఇంకా లిబియాలోని ఉగ్రవాదుల చెరలోనే ఉన్నారు. లిబియాలో తెలుగు ప్రొఫెసర్లు విడుదలై పోయారని ఆయన బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. బాధిత కుటుంబాలనేకాదు తెలుగు ప్రజలందర్నీ తప్పుదోవ పట్టించారు. లిబియా దౌత్య అధికారుల నుంచి నిర్థారణ చేసుకోకుండానే ప్రకటన చేసి నాలుక్కరుచుకున్నారు. […]
మనిషికి కంగారు సహజం! కానీ టీడీపీ నేతలకు విపరీతమైన ఆరాటం! క్రెడిట్ అంతా తామే కొట్టేయాలన్న కక్కుర్తి! అసలు ఈ పసుపు మనుషులు మారరేమో అనిపిస్తుంది. లేకపోతే మరేమిటి? తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలు ఇంకా లిబియాలోని ఉగ్రవాదుల చెరలోనే ఉన్నారు. లిబియాలో తెలుగు ప్రొఫెసర్లు విడుదలై పోయారని ఆయన బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. బాధిత కుటుంబాలనేకాదు తెలుగు ప్రజలందర్నీ తప్పుదోవ పట్టించారు. లిబియా దౌత్య అధికారుల నుంచి నిర్థారణ చేసుకోకుండానే ప్రకటన చేసి నాలుక్కరుచుకున్నారు.
తెలుగు ప్రొఫెసర్ల విడుదల కోసం హైదరాబాద్‌లో ఉన్న కుటుంబసభ్యులు
వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ లిబియా దౌత్య అధికారులతో మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ కవిత రెండుసార్లు సుష్మను కలిసి..తెలుగు ప్రొఫెసర్లను విడిపించాలని కోరారు. ఢిల్లీలో టీడీపీ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా ప్రయత్నించినప్పటికీ ఆయన దృష్టంతా క్రెడిట్ కొట్టేయాలనే! దాన్ని తీసుకెళ్లి తమ అధ్యక్షుడు చంద్రబాబు చేతుల్లో పెట్టి విధేయతను చాటుకోవాలనే! ఉగ్రవాదుల చెర నుంచి బాధితుల్ని విడిపించిన క్రెడిట్ ఎక్కడ టీఆర్ఎస్ ఎంపీలు కొట్టేస్తారేమోనన్న కక్కూర్తితో ఆయన కంగారుగా మీడియా ముందుకు వచ్చేసి.. ప్రొఫెసర్లు విడుదలై పోయారని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. తీరా రాత్రి గడిచినా విడుదల కాకపోవడంతో తలపట్టుకున్నారు. ఉగ్రవాదుల చెరలో వాళ్లు క్షేమంగానే ఉన్నారని సమాచారం అందిందనీ, అతి త్వరలో విడుదలవుతారని సంకేతాలు అందాయని డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నారు.
గతంలోనూ ఇంతే!
కేదార్‌నాథ్ జలప్రళయంలో చిక్కుకున్న తెలుగువారిని డార్జిలింగ్ నుంచి తీసుకురావడంలోనూ టీడీపీ ఇలాగే కక్కూర్తిగా వ్యవహరించింది. తెలంగాణ బాధితుల్ని కూడా తామే తీసుకువచ్చామన్న పేరు కోసం తాపత్రయపడ్డారు. కొందరు టీడీపీ నేతలైతే ఎయిర్‌పోర్టులో వీహెచ్‌తో ఘర్షణకు కూడా దిగారు అసహ్యంగా! అలాగే ఉత్తరాఖండ్‌లో కొట్టుకుపోయిన ఇంజినీరింగ్ విద్యార్థుల మృతదేహాలను హైదరాబాద్‌కి రప్పించడంలో కూడా తెలుగు తమ్ముళ్లు క్రెడిట్ కోసమే ఆరాటపడ్డారు. తెలంగాణకు టీడీపీ ఎంతో చేసిందని శవాలను అడ్డుపెట్టుకుని చాటుకునే ప్రయత్నం చేశారు.