Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 166

బాల్‌ బీటింగ్‌ రాజారావు: “అబ్బాయ్‌! ఈ క్రికెట్‌ బాల్ నీదేనా? వెంకట్‌: అంకుల్‌! ఈ బాల్‌ మీ కిటికీ అద్దాల్ని పగలగొట్టిందా?రా జారావు: అదేం జరగలేదు బాబూ. వెంకట్‌: ఐతే ఈ బాల్‌ నాదే అంకుల్‌! ———————————————————————— కోతి చేష్టలు సన్ని: కోతి ఎందుకని తల గీరుకుంటుంది? బన్ని: నాకు తెలీదు ఎందుకని? సన్ని: ఎందుకంటే ఎక్కడ దురద పెడుతుందో దానికి మాత్రమే తెలుసు గనక! ———————————————————————— తిక్క ప్రశ్న డాక్టర్‌: ఈ టాబ్లెట్‌ రోజుకు మూడుసార్లు […]

బాల్‌ బీటింగ్‌
రాజారావు: “అబ్బాయ్‌! ఈ క్రికెట్‌ బాల్ నీదేనా?
వెంకట్‌: అంకుల్‌! ఈ బాల్‌ మీ కిటికీ అద్దాల్ని పగలగొట్టిందా?రా
జారావు: అదేం జరగలేదు బాబూ.
వెంకట్‌: ఐతే ఈ బాల్‌ నాదే అంకుల్‌!
————————————————————————
కోతి చేష్టలు
సన్ని: కోతి ఎందుకని తల గీరుకుంటుంది?
బన్ని: నాకు తెలీదు ఎందుకని?
సన్ని: ఎందుకంటే ఎక్కడ దురద పెడుతుందో దానికి మాత్రమే తెలుసు గనక!
————————————————————————
తిక్క ప్రశ్న
డాక్టర్‌: ఈ టాబ్లెట్‌ రోజుకు మూడుసార్లు వేసుకోవాలి.
పేషెంట్‌: ఇంత చిన్న టాబ్లెట్‌ని మూడుసార్లు ఎట్లా వేసుకోవాలి సర్‌?
————————————————————————
భరణం
విడాకులకు కోర్టు అనుమతించింది. జడ్జి భర్తతో “మీ ఆవిడకు నెలకు వెయ్యి రూపాయలు భరణంగా ఇవ్వాలని తీర్మానించానయ్యా” అన్నాడు.
దానికి భర్త సంతోషంతో “నాక్కూడా ఒక ఐదు వందలిస్తే సంతోషిస్తా” అన్నాడు.
————————————————————————
జుత్తు-తెలివి
లల్లు: మమ్మీ! నాన్న తలమీద ఎందుకు వెంట్రుకలు లేవు?
తల్లి: మీ నాన్న చాలా తెలివైనవాడు. ఎప్పుడూ ఆలోచిస్తాడు.
లల్లు: మరి నీ తలమీద ఎందుకు అంత జుత్తు ఉంది?
తల్లి: నోరు మూసుకుని టిఫిన్‌ తిను.

First Published:  5 Aug 2015 6:33 PM IST
Next Story