అమెరికా గూఢచర్యంపై దర్యాప్తుకు ఆదేశించిన జపాన్
జపాన్ రాజకీయ నేతలపై వాషింగ్టన్ గూఢచర్యం జరుపుతోందని వికీలీక్స్ వెల్లడించిన విషయాలు కనుక నిజమే అయితే, తాము తీవ్రంగా ఆందోళన చెందుతామని జపాన్ ప్రధాని షింజో అబే అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్‌తో చెప్పారు. వెంటనే దీనిపై దర్యాప్తు జరపాలని ఆయన ఆదేశించినట్లు జపాన్ ఉన్నతాధికారి తెలిపారు. జపాన్ అధికారులు, ప్రధాన కంపెనీలపై అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎస్ఎస్ఎ) గూఢచర్యం జరుపుతోందని అందుకు సంబంధింన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని గత శుక్రవారం వికీలీక్స్ ప్రకటించింది. […]
BY sarvi5 Aug 2015 6:43 PM IST
sarvi Updated On: 6 Aug 2015 7:11 AM IST
జపాన్ రాజకీయ నేతలపై వాషింగ్టన్ గూఢచర్యం జరుపుతోందని వికీలీక్స్ వెల్లడించిన విషయాలు కనుక నిజమే అయితే, తాము తీవ్రంగా ఆందోళన చెందుతామని జపాన్ ప్రధాని షింజో అబే అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్‌తో చెప్పారు. వెంటనే దీనిపై దర్యాప్తు జరపాలని ఆయన ఆదేశించినట్లు జపాన్ ఉన్నతాధికారి తెలిపారు. జపాన్ అధికారులు, ప్రధాన కంపెనీలపై అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎస్ఎస్ఎ) గూఢచర్యం జరుపుతోందని అందుకు సంబంధింన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని గత శుక్రవారం వికీలీక్స్ ప్రకటించింది. అయితే, గూఢచర్యం వ్యవహారంపై జపాన్ చాలా సుతిమెత్తగా స్పందిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.
Next Story