Telugu Global
NEWS

తెలంగాణ‌లో హెల్మెట్ మ‌రికొంత జాప్యం!

తెలంగాణ‌లో ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌న్న నిబంధ‌న మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు ప‌లు రాష్ట్రాలు హెల్మెట్ నిబంధ‌న‌ను త‌ప్ప‌నిస‌రి చేశాయి. కేంద్ర ప్ర‌భుత్వం రోడ్డు భ‌ద్ర‌తా చ‌ట్టం రూపొందిస్తున్న నేప‌థ్యంలో మ‌నం కూడా రోడ్డు భ‌ద్ర‌తా నియ‌మాల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని రాష్ట్ర పోలీసు అధికారులు తెలంగాణ ప్ర‌భుత్వానికి నివేదించారు. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుంటే చ‌లానాలు విధించాలి. ఈ నిబంధ‌న ద్వారా ఎక్కువ మంది ప్ర‌భావిత‌మ‌య్యేది రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే. ఇక్క‌డ […]

తెలంగాణ‌లో హెల్మెట్ మ‌రికొంత జాప్యం!
X
తెలంగాణ‌లో ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌న్న నిబంధ‌న మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు ప‌లు రాష్ట్రాలు హెల్మెట్ నిబంధ‌న‌ను త‌ప్ప‌నిస‌రి చేశాయి. కేంద్ర ప్ర‌భుత్వం రోడ్డు భ‌ద్ర‌తా చ‌ట్టం రూపొందిస్తున్న నేప‌థ్యంలో మ‌నం కూడా రోడ్డు భ‌ద్ర‌తా నియ‌మాల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని రాష్ట్ర పోలీసు అధికారులు తెలంగాణ ప్ర‌భుత్వానికి నివేదించారు. ఇందులో భాగంగా హెల్మెట్ లేకుంటే చ‌లానాలు విధించాలి. ఈ నిబంధ‌న ద్వారా ఎక్కువ మంది ప్ర‌భావిత‌మ‌య్యేది రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే. ఇక్క‌డ వాహ‌నాల సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంటుంది. పైగా డిసెంబ‌రు నాటికి గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేయ‌డం వ‌ల్ల ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న ఆందోళ‌న‌తో ఉన్న‌ట్లు స‌మాచారం. అందుకే హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న‌ను మ‌రికొంత‌కాలం వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.
First Published:  6 Aug 2015 4:43 AM IST
Next Story