మరో కొత్త ప్రాజెక్ట్ తో గోపీచంద్
పండగచేస్కో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఎన్నాళ్లనుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రామ్ కు మంచి కమర్షియల్ విజయాన్నందించాడు. ఇప్పుడీ దర్శకుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో సిద్ధమయ్యాడు. త్వరలోనే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు గోపీచంద్ మలినేని. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, హీరో ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెబుతున్నాడు. తాజా […]
BY admin6 Aug 2015 12:36 AM IST
X
admin Updated On: 6 Aug 2015 7:18 AM IST
పండగచేస్కో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఎన్నాళ్లనుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రామ్ కు మంచి కమర్షియల్ విజయాన్నందించాడు. ఇప్పుడీ దర్శకుడు మరో మాస్ ఎంటర్ టైనర్ తో సిద్ధమయ్యాడు. త్వరలోనే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు గోపీచంద్ మలినేని. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, హీరో ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెబుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ మలినేని మరోసారి రవితేజను డైరక్ట్ చేసే అవకాశముంది. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, మాస్ రాజా రవితేజ మధ్య ఈ దిశగా చర్చలు జరిగాయి. రవితేజ కూడా తన బెంగాల్ టైగర్ సినిమాను పూర్తిచేశాడు. గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే ప్రాజెక్ట్ పై ఓ నిర్ణయం తీసుకుంటాడు. గతంలో రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలొచ్చాయి. రెండూ సూపర్ హిట్టయ్యాయి. సో.. ఈసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతుందన్నమాట.
Next Story