భవనంపై నుంచి దూకి విద్యార్ధిని ఆత్మహత్య
ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ భూతానికి జూనియర్ విద్యార్ధి బలైన సంఘటన మరవక ముందే గుంటూరు జిల్లాలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగ్రామంలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నార్నే సునీత (22) కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య జరిగిన చర్చల్లో సునీత పాల్గొన్నప్పుడు ఫొటోలు తీయడం వివాదంగా మారిందని, ఆ సంఘటన ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లడంతో చర్య […]
BY sarvi5 Aug 2015 6:36 PM IST
sarvi Updated On: 6 Aug 2015 6:31 AM IST
ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ భూతానికి జూనియర్ విద్యార్ధి బలైన సంఘటన మరవక ముందే గుంటూరు జిల్లాలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగ్రామంలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నార్నే సునీత (22) కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య జరిగిన చర్చల్లో సునీత పాల్గొన్నప్పుడు ఫొటోలు తీయడం వివాదంగా మారిందని, ఆ సంఘటన ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లడంతో చర్య తీసుకుంటారేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని కళాశాల యాజమాన్యం చెబుతుండగా కళాశాల యాజమాన్యం, వార్డెన్ వేధింపుల వల్లే సునీత ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. సునీత స్వగ్రామం ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం చందులూరు గ్రామం.
Next Story