సానియా మీర్జా జీవితంపై ఓ సినిమా
భారత్ టెన్నిస్ క్రీడాకారిణి, వరల్డ్ ర్యాంకింగ్‌లో దూసుకెళ్లిన సానియా మీర్జా జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. బాలీవుడ్ లేడీ డైరెక్టర్ ఫరాఖాన్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. సానియామీర్జా రాసిన ఆత్మకథకు ఫరాఖాన్ తెర రూపమివ్వబోతోందని సమాచారం. సానియా జీవితంపై ఎప్పటి నుంచో సినిమా తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు తన స్నేహితురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో సినిమా రూపొందించేందుకు సానియా అంగీకరించింది. సానియా రాసిన ఆత్మకథ పుస్తకం ఈ ఏడాది […]
BY sarvi6 Aug 2015 8:26 AM IST
X
sarvi Updated On: 6 Aug 2015 8:37 AM IST
భారత్ టెన్నిస్ క్రీడాకారిణి, వరల్డ్ ర్యాంకింగ్‌లో దూసుకెళ్లిన సానియా మీర్జా జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. బాలీవుడ్ లేడీ డైరెక్టర్ ఫరాఖాన్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. సానియామీర్జా రాసిన ఆత్మకథకు ఫరాఖాన్ తెర రూపమివ్వబోతోందని సమాచారం. సానియా జీవితంపై ఎప్పటి నుంచో సినిమా తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు తన స్నేహితురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో సినిమా రూపొందించేందుకు సానియా అంగీకరించింది. సానియా రాసిన ఆత్మకథ పుస్తకం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. పుస్తకంలోని అంశాలు, వాస్తవాలను తెరకెక్కించాలనే ఆలోచనతో ఫరాఖాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. అయితే సానియా పాత్రకు సానియా అయితే న్యాయం చేయగలదని ఫరాఖాన్ అభిప్రాయం కాగా, తన పాత్రకు పరిణితీ చోప్రా అయితే న్యాయం చేస్తుందని మీర్జా అభిప్రాయపడుతోందట.
క్రీడాకారుల జీవిత చిత్రాలు
సినిమా కథాంశానికి ఏదీ అనర్హం కాదు. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. క్రైమ్ , హారర్, కామెడీ, లవ్, సెంటిమెంట్, మాఫియా బ్యాక్‌డ్రాప్, ఫ్యాక్షన్, సోషియో ఫాంటసీ జోనర్‌లో సినిమాలు వచ్చాయి. ఇవి కూడా ఒక సినిమా హిట్ అయితే అదే లైన్‌ను తీసుకుని సినిమాలు రూపొందించడం సినిమా బిజినెస్ ట్రిక్. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రీడాకారుల జీవిత చరిత్ర ఆధారంగా తీసే చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగా ఉంటోంది. అందుకే మూవీమేకర్స్ వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారి జీవిత చరిత్రలతో సినిమాలు తీస్తూ బాక్సాఫీస్ కొల్లగొడుతున్నారు. బాక్సర్ మేరీకోమ్, పరుగుల వీరుడు మిల్కాసింగ్ జీవిత కథల ఆధారంగా సినిమాలు రూపొంది బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. తాజాగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, ప్రస్తుత కెప్టెన్ ధోనిల జీవిత కథలతోపాటు ప్రముఖ కుస్తీవీరుడు మహవీర్ ఫోగత్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగులో కూడా అథ్లెట్ అశ్వనీనాచప్ప జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీశారు. అందులో అశ్వనీ నాచప్పే నటించారు. వరల్డ్ నెంబర్‌వన్ ర్యాంకింగ్ వైపు దూసుకుపోయిన హైదరాబాదీ సానియా మీర్జా సినిమాపై ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Next Story