ఉగ్రవాదుల చెర నుంచి బలరాం, గోపీకృష్ణ విడుదల
లిబియా రాజధాని ట్రిపోలి నుంచి కిడ్నాప్‌కు గురైన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా విడుదలయ్యారు. వారం రోజులుగా వీరు కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. దీంతో రెండు కుటుంబాల్లోని వారు కంటి మీద కునుకులేకుండా వారి కోసం పడిగాపులు పడ్డారు. కిడ్నాపైన బలరాం, గోపీకృష్ణలను తీవ్రవాదులు విడుదల చేశారని, అక్కడి భారత దౌత్య కార్యాలయానికి తరలించారని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ తెలిపారు. ఈ తెలుగు ఫ్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలను విడుదల చేసినట్లు విదేశాంగశాఖ ద్వారా […]
లిబియా రాజధాని ట్రిపోలి నుంచి కిడ్నాప్‌కు గురైన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా విడుదలయ్యారు. వారం రోజులుగా వీరు కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. దీంతో రెండు కుటుంబాల్లోని వారు కంటి మీద కునుకులేకుండా వారి కోసం పడిగాపులు పడ్డారు. కిడ్నాపైన బలరాం, గోపీకృష్ణలను తీవ్రవాదులు విడుదల చేశారని, అక్కడి భారత దౌత్య కార్యాలయానికి తరలించారని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ తెలిపారు. ఈ తెలుగు ఫ్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలను విడుదల చేసినట్లు విదేశాంగశాఖ ద్వారా కూడా తనకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. త్వరలోనే ఈ ఇద్దరి తెలుగువారిని భారత్‌కు తీసుకువస్తామని కంభంపాటి తెలిపారు. ఈ ప్రొఫెసర్ల విడుదల సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.