Telugu Global
Others

ఒక‌రు ఫాం హౌస్ సీఎం.. మ‌రొక‌రు ఫారిన్ సీఎం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక‌రు ఫాం హౌస్ సీఎం కాగా మ‌రొక‌రు ఫారిన్ సీఎం అని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పిసిసి అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి  ఎద్దేవా చేశారు.  పార్టీ కార్యాలయం ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌ను ఫాం సీఎం అని,  చంద్ర‌బాబును ఫారిన్‌ సీఎం అని ప్రజలు పిలుచుకుంటున్నార‌న్నారు.  ఇద్ద‌రూ తెలుగువారి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ర‌ఘువీరా విమ‌ర్శించారు. వెనుకబడిన ప్రాంతాల్లో కరువు తాండవిస్తున్నా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ప‌ట్టించుకోవ‌డ‌మే లేద‌ని అన్నారు. వర్షాభావ పరిస్ధితులపై ముఖ్యమంత్రులు […]

ఒక‌రు ఫాం హౌస్ సీఎం.. మ‌రొక‌రు ఫారిన్ సీఎం
X
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక‌రు ఫాం హౌస్ సీఎం కాగా మ‌రొక‌రు ఫారిన్ సీఎం అని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పిసిసి అధ్యక్షుడు ఎన్‌ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయం ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌ను ఫాం సీఎం అని, చంద్ర‌బాబును ఫారిన్‌ సీఎం అని ప్రజలు పిలుచుకుంటున్నార‌న్నారు. ఇద్ద‌రూ తెలుగువారి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ర‌ఘువీరా విమ‌ర్శించారు. వెనుకబడిన ప్రాంతాల్లో కరువు తాండవిస్తున్నా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు ప‌ట్టించుకోవ‌డ‌మే లేద‌ని అన్నారు. వర్షాభావ పరిస్ధితులపై ముఖ్యమంత్రులు బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ఇద్దరు ముఖ్యమంత్రులు విఫ‌ల‌మ‌య్యార‌ని మండిపడ్డారు. ఒకరు ఫాం హౌస్‌కు పరిమితమైతే..మరొకరు ఫారిన్‌ అంటూ టూర్లు తిరుగుతూ ప్రజలను పట్టించుకోవడం లేదని విమ‌ర్శించారు. రిజర్వాయర్లు అడుగంటుతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇప్పటికీ రైతులు రుణమాఫీలు అమలు కాకపోవడం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు అందకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు మేల్కొని ముందస్తు చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని ర‌ఘువీరా డిమాండ్‌ చేశారు.
First Published:  5 Aug 2015 3:31 AM IST
Next Story