ముంబయి దాడి మా దేశం పనే
పాక్ అధికారి చెప్పిన సత్యం ఇది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ) మాజీ అధికారి రాసిన ఓ వ్యాసం ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. దీంతో భారత్‌పై పంజా విసురుతున్న ఉగ్రవాదానికి తమ దేశంతో ఏసంబంధమూ లేదన్న పాక్‌కి ఇప్పుడు నోరు పెగలని పరిస్థితి వచ్చింది. 250 మందికి పైగా పొట్టనపెట్టుకున్న ముంబయి మారణ హోమానికి ఆజ్యం పోసింది తను కాదని మనం చెప్పగల స్థితిలో ఉన్నామా?… జీర్ణించుకోలేని నిజాల్ని ఎదుర్కోవడానికి… మన భూభాగం నుంచే పేట్రేగిపోతున్న ఉగ్రవాద రాక్షసుల పనిపట్టడానికి […]
BY sarvi5 Aug 2015 7:35 AM IST
X
sarvi Updated On: 5 Aug 2015 7:57 AM IST
పాక్ అధికారి చెప్పిన సత్యం ఇది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ) మాజీ అధికారి రాసిన ఓ వ్యాసం ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. దీంతో భారత్‌పై పంజా విసురుతున్న ఉగ్రవాదానికి తమ దేశంతో ఏసంబంధమూ లేదన్న పాక్‌కి ఇప్పుడు నోరు పెగలని పరిస్థితి వచ్చింది. 250 మందికి పైగా పొట్టనపెట్టుకున్న ముంబయి మారణ హోమానికి ఆజ్యం పోసింది తను కాదని మనం చెప్పగల స్థితిలో ఉన్నామా?… జీర్ణించుకోలేని నిజాల్ని ఎదుర్కోవడానికి… మన భూభాగం నుంచే పేట్రేగిపోతున్న ఉగ్రవాద రాక్షసుల పనిపట్టడానికి ఒక జాతిగా మనం సిద్ధంగా ఉన్నామా? అని పాక్ సర్కారును ప్రశ్నించారు ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ) మాజీ అధిపతి తారిఖ్ ఎం ఖోసా. భారత ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో వందలాది ప్రాణాల్ని బలిగొన్న 2008 నాటి ఉగ్రవాద దాడులకు (26/11) పాక్ భూభాగం నుంచే కుట్ర చేసి, అమలు జరిపినట్లు డాన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం ద్వారా మరోసారి తిరుగులేని ఆధారం బయటపడింది. ఈ దాడి జరిగిన తేదీ తర్వాత ఆయన ఎఫ్‌ఐఏ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆ దాడుల్లో దొరికిపోయి, భారత ప్రభుత్వం ఉరితీసిన ఉగ్రవాది కసబ్ తమ జాతీయుడేనంటూ… పాకిస్థాన్‌లో అతని చదువు సాగిన వైనాన్ని, నిషేధిత ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందిన విషయాన్ని గురించి పాక్ పత్రిక డాన్‌లో రాసిన వ్యాసంలో ఖోసా స్వయంగా అంగీకరించారు. 2008 నాటి ఈ ఘోరం గురించి పాకిస్తాన్‌లో నమోదైన కేసులను ఖోసా బృందమే దర్యాప్తు చేసింది. ముంబై మారణకాండపై పాక్ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని ఖోసా తన వ్యాసంలో నిష్కర్షగా వ్యాఖ్యానించారు. గత నెలలో రష్యాలో జరిగిన భారత్, పాక్ ప్రధానుల సమావేశాన్ని ఉటంకిస్తూ రాసిన ఈ వ్యాసంలో ఖోసా… పై ప్రశ్నలను పాక్ ప్రభుత్వానికి సంధించారు. ఈ సమావేశం అనంతరం ఉభయ దేశాల ప్రధానులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐదు సూత్రాల రోడ్ మ్యాప్‌ను పేర్కొన్నారు. ముంబయి కేసు విచారణను పాక్‌లో వేగవంతం చేసేందుకు మాటల నమూనాలను అందించడం సహా అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించాలని అంగీకరించారు. కాని పాకిస్థాన్ ఆ తర్వాత మాట మార్చింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలు, సమాచారం కావాలని భారత్‌ను కోరింది. దీని వెనుక తీవ్రవాదుల హస్తం ఉందన్న విషయాన్ని పరోక్షంగా తన వ్యాసంలో ఖోసా వెల్లడించారు. పేలుళ్ళ ఘాతుకానికి ఒడిగట్టేందుకు సింధ్‌లో ఉన్న లష్కరే తొయిబా ఉగ్రవాద శిబిరం నుంచి శిక్షణ పొందిన 10 మందిని సముద్ర మార్గంలో ముంబై పంపిన విషయాన్ని ఖోసా ధృవీకరించారు. అప్పుడు ఉపయోగించిన పేలుడు పదార్థాలు కూడా ఇక్కడివేనని తన వ్యాసంలో ఆయన ధ్రువీకరించారు.
Next Story