లలిత్‌మోడికి అరెస్ట్ వారెంట్ జారీ
ఐపిఎల్ మాజీ ఛైర్మన్ లలిత్‌మోడిపై ముంబయి హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఐపీయల్‌లో లలిత్ మోడీ మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాయర్ ద్వారా అతనికి గతంలోనే సమన్లు జారీ చేశామని ఈడీ లాయర్ తెలిపారు. దానికి ఇంతవరకు మోడీ నుంచి సమాధానం రాకపోడంతో జూలై 3వ తేదిన ప్రత్యేక న్యాయస్థానం ద్వారా కోర్టుకు హాజరు కావాలని మరొకసారి సమన్లు జారీ చేశామని అయినా మోడీ స్పందించలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ […]
BY sarvi5 Aug 2015 4:05 AM GMT
X
sarvi Updated On: 5 Aug 2015 4:05 AM GMT
ఐపిఎల్ మాజీ ఛైర్మన్ లలిత్‌మోడిపై ముంబయి హైకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఐపీయల్‌లో లలిత్ మోడీ మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాయర్ ద్వారా అతనికి గతంలోనే సమన్లు జారీ చేశామని ఈడీ లాయర్ తెలిపారు. దానికి ఇంతవరకు మోడీ నుంచి సమాధానం రాకపోడంతో జూలై 3వ తేదిన ప్రత్యేక న్యాయస్థానం ద్వారా కోర్టుకు హాజరు కావాలని మరొకసారి సమన్లు జారీ చేశామని అయినా మోడీ స్పందించలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లాయర్ తెలిపారు. దీంతో మనీ ల్యాండరింగ్ నియంత్రణ చట్టం కింద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముంబయి ప్రత్యేక న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఈమేరకు స్పందించింది. ఈడీ పలుసార్లు ఇచ్చిన సమన్లకు ఒక్కసారి కూడా ఆయన స్పందించక పోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం సబబని కోర్టు భావించినట్టు సెషన్స్ న్యాయమూర్తి పిఆర్ భవెకే తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి బ్రిటన్‌లో ఉన్న లలిత్‌మోడికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది.
Next Story