Telugu Global
Health & Life Style

తాగుబోతుల‌కు పెళ్లే మందు

మీ అబ్బాయి చేయి జారిపోతున్నాడ‌ని బాధ‌ప‌డుతున్నారా? త‌ప్ప‌తాగి ఇంటికొస్తున్నాడా? డ‌్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డి మీ ప‌రువు తీస్తున్నాడా? ఎన్నిసార్లు చెప్పినా మందు మాన‌డం లేదా? అయితే వెంట‌నే పెళ్లి చేయండి..తిక్క కుదురుతుందంటున్నారు అమెరికాలోని మిసౌరీ యూనివ‌ర్సీటీ ప‌రిశోధ‌కులు. పీపాలు పీపాలు ఆల్కాహాల్ తాగేసే గ‌జ తాగుబోతుల్లో కూడా పెళ్లి మార్పు తెస్తుంద‌ని చెబుతున్నారు. పెళ్లితో మెచ్యూరిటీ: పెళ్లితో ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పుతోబాటు మాన‌సికంగా ప‌రిప‌క్వ‌త వ‌స్తుంద‌ని తేల్చారు..మిసౌరీ యూనివర్సిటీ సైక‌లాజిక‌ల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ ప‌రిశోధ‌కులు. పెళ్లితో వ‌చ్చే బాధ్య‌త‌లు..డిమాండ్ల‌ను […]

తాగుబోతుల‌కు పెళ్లే మందు
X

మీ అబ్బాయి చేయి జారిపోతున్నాడ‌ని బాధ‌ప‌డుతున్నారా?
త‌ప్ప‌తాగి ఇంటికొస్తున్నాడా? డ‌్రంక్ అండ్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డి మీ ప‌రువు తీస్తున్నాడా?
ఎన్నిసార్లు చెప్పినా మందు మాన‌డం లేదా? అయితే వెంట‌నే పెళ్లి చేయండి..తిక్క కుదురుతుందంటున్నారు అమెరికాలోని మిసౌరీ యూనివ‌ర్సీటీ ప‌రిశోధ‌కులు. పీపాలు పీపాలు ఆల్కాహాల్ తాగేసే గ‌జ తాగుబోతుల్లో కూడా పెళ్లి మార్పు తెస్తుంద‌ని చెబుతున్నారు.
పెళ్లితో మెచ్యూరిటీ:
పెళ్లితో ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పుతోబాటు మాన‌సికంగా ప‌రిప‌క్వ‌త వ‌స్తుంద‌ని తేల్చారు..మిసౌరీ యూనివర్సిటీ సైక‌లాజిక‌ల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ ప‌రిశోధ‌కులు. పెళ్లితో వ‌చ్చే బాధ్య‌త‌లు..డిమాండ్ల‌ను అందుకోవ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు కూడా ఇందుకు కార‌ణ‌మ‌ని వివ‌రిస్తున్నారు. 18 నుంచి 40 ఏళ్ల‌లోపు డ్రింక‌ర్లను త‌మ ప‌రిశోధ‌న‌కు ఎంచుకున్నారు. పెళ్లి త‌ర్వాత వారిలో మార్పులు గ‌మ‌నించారు. వారానికి నాలుగైదుసార్లు సిట్టింగ్‌లు వేసే కుర్రాళ్లు కూడా పెళ్లి త‌ర్వాత తాగుడు త‌గ్గించార‌ని గుర్తించారు. మ్యారైజ్ లైఫ్‌కి అల‌వాటు ప‌డ‌టానికి తిరుగుళ్లు, తాగుడు త‌గ్గించ‌క త‌ప్ప‌ద‌ని తేల్చారు. ఆశ్చ‌ర్యం ఏమిటంటే పెళ్లి త‌ర్వాత సివియ‌ర్ డ్రింక‌ర్స్‌లో ఎక్కువ మార్పు చూశామంటున్నారు ప‌రిశోధ‌కులు. వారిలో ఇన్ టేక్ చాలా త‌గ్గిందంటున్నారు. మొత్తానికి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందంటారు ఇదేనోమో!!

First Published:  5 Aug 2015 5:33 AM IST
Next Story