Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 165

మినిస్టర్‌ తెలివి హెల్త్‌ మినిస్టర్‌ ఒకాయన నగరంలోని పెద్ద హాస్పిటల్‌కి విజిట్‌కొచ్చాడు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అధికారులు మినిస్టర్‌ గారిని ఆపరేషన్‌ థియేటర్‌, జనరల్‌ వార్డుల్లో తిప్పారు.  చివరికి ఉమెన్‌ పేషెంట్స్‌ వార్డుకు తీసుకొచ్చారు.  “సర్‌! ఇది లేబర్‌ వార్డ్‌” సర్‌ అన్నాడు ఒకాయన. ముందుకు వెళ్లపోయిన మినిస్టర్‌ ఆగి “నేను ఈ వార్డును విజిట్‌ చేయను. మన ప్రభుత్వంలో లేబర్‌ మినిస్టర్‌ ఉన్నారు కదా! నేను ఇంకొకరు చేయాల్సిన పని చేయను” అంటూ వెళ్లిపోయాడు. […]

మినిస్టర్‌ తెలివి
హెల్త్‌ మినిస్టర్‌ ఒకాయన నగరంలోని పెద్ద హాస్పిటల్‌కి విజిట్‌కొచ్చాడు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అధికారులు మినిస్టర్‌ గారిని ఆపరేషన్‌ థియేటర్‌, జనరల్‌ వార్డుల్లో తిప్పారు.
చివరికి ఉమెన్‌ పేషెంట్స్‌ వార్డుకు తీసుకొచ్చారు. “సర్‌! ఇది లేబర్‌ వార్డ్‌” సర్‌ అన్నాడు ఒకాయన.
ముందుకు వెళ్లపోయిన మినిస్టర్‌ ఆగి “నేను ఈ వార్డును విజిట్‌ చేయను. మన ప్రభుత్వంలో లేబర్‌ మినిస్టర్‌ ఉన్నారు కదా! నేను ఇంకొకరు చేయాల్సిన పని చేయను” అంటూ వెళ్లిపోయాడు.
————————————————————————
బిల్లు షాక్‌
డాక్టర్‌: వారంలో మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఐతే మీరు కారులో తిరగడం మానేసి ఎప్పుడూ నడవడం అలవాటు చేసుకోవాలి.
పేషెంట్‌: తప్పకుండా. వచ్చేవారం హాస్పటల్‌ బిల్లు కట్టాకా నాకు తప్పేట్లు లేదు.
————————————————————————
బీటింగ్‌
డాక్టర్‌: మీ ఆవిడ టెన్నిస్‌ బ్యాట్‌తో కొట్టిందా? ఎందుకని?
పేషెంట్‌: సమయానికి క్రికెట్‌ బ్యాట్‌ దొరకలేదని!
————————————————————————
వా”నరుడు”
కొడుకు: అమ్మా! మనం కోతుల్నించి వచ్చామని నాన్న చెప్పాడు నిజమేనా?
తల్లి: ఏమెనాన్నా! నాకు మీ నాన్నగారి కుటుంబం గురించి అంతగా తెలీదు.

First Published:  4 Aug 2015 6:33 PM IST
Next Story