చినుకు లేక వణుకు
వానమ్మ..వానమ్మ ..ఒక్కసారన్నా వచ్చిపోయే వానమ్మ అని పల్లెలు పలవరిస్తున్నాయి. వర్షాకాలం సీజన్ దాటిపోతున్నా వరుణుడు కరుణించడకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. వర్షాభావ పరిస్థితులు తరుముకొస్తున్న తరుణంలో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఓ వైపు సాగునీటి ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్‌కు చేరాయి. వరి నారు మళ్లు ఎండిపోయాయి. విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ మొలకెత్తిన మొక్కలు మాడిపోయాయి. పత్తి చేలు వాడిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. 10 జిల్లాల్లోనూ సగటు వర్షపాతం సగం […]
BY sarvi4 Aug 2015 10:40 AM IST
X
sarvi Updated On: 4 Aug 2015 11:34 AM IST
వానమ్మ..వానమ్మ ..ఒక్కసారన్నా వచ్చిపోయే వానమ్మ అని పల్లెలు పలవరిస్తున్నాయి. వర్షాకాలం సీజన్ దాటిపోతున్నా వరుణుడు కరుణించడకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. వర్షాభావ పరిస్థితులు తరుముకొస్తున్న తరుణంలో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. ఓ వైపు సాగునీటి ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్‌కు చేరాయి. వరి నారు మళ్లు ఎండిపోయాయి. విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ మొలకెత్తిన మొక్కలు మాడిపోయాయి. పత్తి చేలు వాడిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. 10 జిల్లాల్లోనూ సగటు వర్షపాతం సగం కూడా నమోదు కాలేదు. సాగునీటి సంగతి దేవుడెరుగు. కనీసం తాగునీరైనా అందుతుందో లేదో అనే ఆందోళనలో జనం ఉన్నారు. వ్యవసాయంపై ఆధారపడి రంగారెడ్డి జిల్లాలో అతి ఎక్కువ మంది జీవిస్తున్నారు. వాణిజ్యపంటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రంగారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో సాగు ప్రశ్నార్థకమైంది. ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలో సాగు విస్తీర్ణం 41లక్షల 43వేల హెక్టార్లు. ఆగష్టు నెలలో సాగు కావాల్సింది 29లక్షల 12వేల హెక్టార్లు. కానీ ఇప్పటి వరకు సాగైంది 26లక్షల హెక్టార్లు మాత్రమే. 3,14,376 హెక్టార్లలో వేయాల్సిన వరి 1,18,617 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 2,31,417 హెక్టార్లలో వరిసాగైంది. గత సంవత్సరంతో పోల్చు కుంటే ఇప్పుడు 1,12,800 హెక్టార్లలో తగ్గినట్లు స్పష్టమ తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా రైతులు సాగుచేసే వాణిజ్య పంటైన పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది లక్షా 79వేల హెక్టార్లలో సాగైతే ఇప్పుడు లక్షా 69వేల హెక్టార్లకే పరిమితమైంది. తెలంగాణ వ్యాప్తంగా కరువు ఛాయలు కనిపిస్తున్న క్రమంలో తమను ఆదుకోవాలని రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతోంది.
Next Story