హైకోర్టు నోటీసులు తిరస్కరించిన తెలంగాణ స్పీకర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు మరో మలుపు తీసుకుంది. హైకోర్టు పంపిన నోటీసులను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు జారీచేసిన నోటీసులను రిజిష్టర్డ్ పోస్టులో పంపగా, తెలంగాణ శాసనసభ స్పీకర్ తిరస్కరించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ సోమవారం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. టీఆర్ ఎస్‌లో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే స్పందించకపోవడంతో టీడీపీ,వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించాయి. వీటిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం […]
BY sarvi3 Aug 2015 6:53 PM IST
X
sarvi Updated On: 4 Aug 2015 10:54 AM IST
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు మరో మలుపు తీసుకుంది. హైకోర్టు పంపిన నోటీసులను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు జారీచేసిన నోటీసులను రిజిష్టర్డ్ పోస్టులో పంపగా, తెలంగాణ శాసనసభ స్పీకర్ తిరస్కరించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ సోమవారం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. టీఆర్ ఎస్‌లో చేరిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే స్పందించకపోవడంతో టీడీపీ,వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించాయి. వీటిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయన తిరస్కరించారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసు మళ్లీ గురువారం విచారణకు రానుంది.
Next Story