ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ: సోనియా
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. లోక్‌సభ నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి అప్రజాస్వామిక పోకడలకు నిదర్శనమని అన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత […]
BY sarvi4 Aug 2015 5:29 AM GMT
X
sarvi Updated On: 4 Aug 2015 5:48 AM GMT
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. లోక్‌సభ నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి అప్రజాస్వామిక పోకడలకు నిదర్శనమని అన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రతిపక్షాల ఆందోళనలను అర్ధం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను, ఉన్నత ప్రమాణాలను మంత్రులు పాటించేలా ప్రభుత్వం చూడాలని ఆయన సూచించారు. ఒక కేంద్రమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రవర్తన దేశానికి సిగ్గు చేటుగా నిలిచిందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ లోక్‌సభలో ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా మా అందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు అందరితో కలిసి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. సామాజిక, మాధ్యమాల ద్వారా కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తామని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా, వ్యాపం అంశంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వ్యవహారంపై.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వ్యవహారంపై కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని రాహుల్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ లోక్‌సభలో ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా మా అందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు, రైతులు అందరితో కలిసి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. సామాజిక, మాధ్యమాల ద్వారా కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తామని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా, వ్యాపం అంశంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వ్యవహారంపై.. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వ్యవహారంపై కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని రాహుల్ స్పష్టం చేశారు.
లోక్‌సభ నుంచి 25 ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, బీజేడీ, వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌కు సంఘీభావం ప్రకటించాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ కేంద్రమంత్రులు మల్లిఖార్జునఖర్గే, గులాంనబీ అజాద్‌తోపాటు అహ్మద్‌పటేల్, కేవీపీ రామచంద్రరావు సహా పలువురు కాంగ్రెస్ నేతలంతా చేతికి నల్ల రిబ్బెన్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు విపక్షాలు బాసటగా యూపీఏ మిత్రపక్షాలన్నీ నిలిచాయి. టీఎంసీ, ఎన్సీపీ, జేడీయూ, బీజేడీతోపాటు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌ను తప్పుబట్టాయి. ఐదు రోజులపాటు సస్సెండ్ చేయడం అనైతికమని, వీటిని వెంటనే ఉపసంహరించాలని ధర్నాలో పాల్గొన్న పలువురు నాయకులు డిమాండు చేశారు.
Next Story