శేషాచలం ఎన్‌కౌంటర్‌పై విచారణ 3 వారాలు వాయిదా
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో 22 మంది ఎన్‌కౌంటర్‌కు కారణమైన శేషాచలం ఘటనపై విచారణను హైకోర్టు మూడు వారాలపాటు వాయిదా వేసింది. ముగ్గురు సాక్షులను తిరిగి విచారించాలని సిట్ అధికారులను ఆదేశించింది. శేఖర్, ఇలంగోవెల్, బాలచందర్ ఇళ్ల వద్దనే సాక్ష్యాలను సేకరించాలని ఆదేశించింది. సాక్ష్యాలను సేకరించే సమయంలో వీడియో రికార్డింగ్ తప్పనిసరి అని పేర్కొంది. న్యాయవాదుల సమక్షంలో ఈ ప్రక్రియను కొనసాగించాలని, తదుపరి విచారణ సమయంలో ఈ సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచాలని న్యాయస్థానం సూచించింది.
BY sarvi3 Aug 2015 6:41 PM IST
X
sarvi Updated On: 4 Aug 2015 6:01 AM IST

Next Story