పాక్ ప్రధానిపై మాజీ సైనికుడి దాడి
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ లక్ష్యంగా ఆ దేశ వైమానిక దళానికి చెందిన మాజీ అధికారి ఒకరు మెరుపు దాడికి దిగాడు. కారుతో వేగంగా దూసుకు వచ్చిన రిటైర్ట్ ఎయిర్ కమాండర్ హఫీజ్ ఉర్ రెహ్మాన్, నవాజ్ షరీఫ్ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. పాక్ పట్టణం ముర్రీలోని హిల్ రిసార్ట్ నుంచి ఇస్లామాబాద్‌కు తిరిగివస్తున్న సమయంలో షరీఫ్‌పై ఈ […]
BY sarvi3 Aug 2015 6:36 PM IST
X
sarvi Updated On: 4 Aug 2015 5:34 AM IST
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ లక్ష్యంగా ఆ దేశ వైమానిక దళానికి చెందిన మాజీ అధికారి ఒకరు మెరుపు దాడికి దిగాడు. కారుతో వేగంగా దూసుకు వచ్చిన రిటైర్ట్ ఎయిర్ కమాండర్ హఫీజ్ ఉర్ రెహ్మాన్, నవాజ్ షరీఫ్ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. పాక్ పట్టణం ముర్రీలోని హిల్ రిసార్ట్ నుంచి ఇస్లామాబాద్‌కు తిరిగివస్తున్న సమయంలో షరీఫ్‌పై ఈ దాడి జరిగింది. నకిలీ నెంబర్ ప్లేట్ కలిగిన కారుతో వేగంగా దూసుకువచ్చిన రెహ్మాన్ తొలుత షరీఫ్ కాన్వాయ్‌ను ఓవర్ టేక్ చేసి, ఆ తర్వాత షరీఫ్ ఉన్న కారును తన కారుతో ఢీకొట్టాడు. వెనువెంటనే అప్రమత్తమైన పోలీసులు రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story