ర్యాగింగే రిషితేశ్వరి ప్రాణం తీసింది
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి మృతికి ర్యాగింగే కారణమని తేలినట్లు సమాచారం. రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ బాల సుబ్రమణ్యం నేతృత్వంలో నియమించిన విచారణ కమిటీ ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిటీ సీనియర్ల వేధింపుల వల్లే రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బాల సుబ్రమణ్యం సోమవారం సచివాలయంలో సీఎస్‌నుకలిసి ఇందుకు సంబంధించిన ప్రాథమిక విషయాల్ని వివరించినట్లు […]
BY Pragnadhar Reddy4 Aug 2015 2:40 AM IST
X
Pragnadhar Reddy Updated On: 4 Aug 2015 6:41 AM IST
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి మృతికి ర్యాగింగే కారణమని తేలినట్లు సమాచారం. రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ బాల సుబ్రమణ్యం నేతృత్వంలో నియమించిన విచారణ కమిటీ ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిటీ సీనియర్ల వేధింపుల వల్లే రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బాల సుబ్రమణ్యం సోమవారం సచివాలయంలో సీఎస్‌నుకలిసి ఇందుకు సంబంధించిన ప్రాథమిక విషయాల్ని వివరించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక బాల సుబ్రమణ్యం కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది.
Next Story