ప్రజారవాణాతోనే సమస్యలకు పరిష్కారం
ప్రజా రవాణాను మెరుగుపరచడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో సమస్యలు పరిష్కరించవచ్చని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మల్టీలెవల్ ఫ్లైఓవర్లు ప్రజారవాణాను మెరుగు పరుస్తాయా’ అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ సి.రాంచంద్రయ్య మాట్లాడుతూ ప్రజారవాణాకు వెన్నెముక అయిన ఆర్‌టిసికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతివ్వడం లేదని […]
BY sarvi4 Aug 2015 10:35 AM IST
X
sarvi Updated On: 4 Aug 2015 10:35 AM IST
ప్రజా రవాణాను మెరుగుపరచడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో సమస్యలు పరిష్కరించవచ్చని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘మల్టీలెవల్ ఫ్లైఓవర్లు ప్రజారవాణాను మెరుగు పరుస్తాయా’ అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ సి.రాంచంద్రయ్య మాట్లాడుతూ ప్రజారవాణాకు వెన్నెముక అయిన ఆర్‌టిసికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతివ్వడం లేదని విమర్శించారు. ఆర్‌టిసి, పాదచారులు, సైక్లిస్టులు, ఎంఎంటిఎస్ ద్వారా 75 శాతం మంది ప్రయాణం చేస్తున్నారని, మోటార్ సైకిళ్లు, ఆటోలు, ఇతర వాహనాల ద్వారా 15 శాతం, 10శాతం మంది మాత్రమే కార్ల ద్వారా ప్రయాణిస్తున్నారని వివరించారు. 75 శాతం ప్రజారవాణాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం 10 శాతం కార్ల ప్రయాణానికే ఇస్తున్నారని, అందులో భాగమే మల్టీలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణమని రామచంద్రయ్య ఆరోపించారు. నగరంలో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు ఏ ప్రాతిపదికన నిర్మించనున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదల సొమ్మును పెద్దలకు ఖర్చుచేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా యన్నారు. ‘కెబిఆర్ పార్కుచుట్టూ సంపన్నుల కార్లు ఆగితే ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడంలేదని, అదే బైకు ఆగితే ఇంటికి ఛలాన్ వస్తుందన్నారు. జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న తాగునీటి సరఫరా యాకుత్‌పురలో జరగడంలేదన్నారు.భవిష్యత్తులో ఏ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య వచ్చే అవకాశముంది, ఎంత ఖర్చుతో ఫ్లైఓవర్లు నిర్మించాలి, ఈ ఫ్లైఓవర్లను వేటికి అనుసంధానం చేస్తారు, గతంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, సబ్‌వేల పరిస్థితేంటి అనే అంశాలపై సమగ్ర అధ్యయనంలేదని అన్నారు.
Next Story