సభలో ఆందోళన చాలా కాస్ట్‌లీ గురూ!
“ప్రజాసమస్యలపై పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం. ఉభయసభల్లో పాలకపక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాం” అని విపక్షాలు చాలా ఘనంగా ప్రకటిస్తాయి. ప్రతిపక్షంలో ఎవరున్నా ఇవే ఢాంబికాలు పలుకుతారు. జెండాలే వేరుగా ఉంటాయి గానీ..పాలక, ప్రతిపక్షాలకు సేమ్ టు సేమ్ అజెండాలతో సభలో సమస్యల్ని లేవనెత్తుతాయి. పాలక, ప్రతిపక్ష అరుపులు, ఆందోళనలు నీకోసం, నాకోసం దేశ ప్రజలందరి కోసమంటూ పార్లమెంటు సాక్షిగా నినదిస్తారు. కానీ విపక్ష సభ్యులు అరిచే అరుపులు, చేసే వాకౌట్‌లు, నిరసనలు..పాలక పక్షం ఇచ్చే కౌంటర్లు, సభను స్తంభింపజేసే […]
BY sarvi4 Aug 2015 8:41 AM IST
X
sarvi Updated On: 4 Aug 2015 9:57 AM IST
“ప్రజాసమస్యలపై పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం. ఉభయసభల్లో పాలకపక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాం” అని విపక్షాలు చాలా ఘనంగా ప్రకటిస్తాయి. ప్రతిపక్షంలో ఎవరున్నా ఇవే ఢాంబికాలు పలుకుతారు. జెండాలే వేరుగా ఉంటాయి గానీ..పాలక, ప్రతిపక్షాలకు సేమ్ టు సేమ్ అజెండాలతో సభలో సమస్యల్ని లేవనెత్తుతాయి. పాలక, ప్రతిపక్ష అరుపులు, ఆందోళనలు నీకోసం, నాకోసం దేశ ప్రజలందరి కోసమంటూ పార్లమెంటు సాక్షిగా నినదిస్తారు. కానీ విపక్ష సభ్యులు అరిచే అరుపులు, చేసే వాకౌట్‌లు, నిరసనలు..పాలక పక్షం ఇచ్చే కౌంటర్లు, సభను స్తంభింపజేసే కార్యక్రమాలు చాలా కాస్ట్‌లీ వ్యవహారం. ఇది ఎంతలా అంటే.. పార్లమెంటు సమావేశాల నిర్వహణకు నిమిషానికి రూ.2.50 లక్షలు ఖర్చవుతుంది. దీనిని ఉద్దేశించి ఏమో పాలక, ప్రతిపక్షాలు సభాసమయం చాలా విలువైనది వృథా చేయొద్దని ఒకరికొకరు హితవు చెబుతుంటారు. కానీ పరిస్థితి షరా మామూలే. కరిగిపోతున్న కాలం వెనుక ఖర్చవుతున్న ప్రజాధనం వందల కోట్లలో ఉంటోంది. వ్యాపం, లలిత్‌గేట్ వివాదాలకు సంబంధించి పార్లమెంటులో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి, అధికార బిజెపికి మధ్య జరుగుతున్న వివాదం దేశ ఖజానాను ఖాళీ చేస్తోంది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు నిమిషానికి రూ 2.50 లక్షలు వ్యయమవుతుందని తెలిసి కూడా విపక్షం బెట్టు వీడదు..పాలకపక్షం మెట్టు దిగకపోవడంతో సభా సమయమంతా వృథా అవుతోంది. వర్షాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లో వృథా సమయం ఖరీదు అక్షరాలా 260 కోట్లు.
Next Story