Telugu Global
Others

మూలన పడ్డ రూ. 37.2 కోట్ల కరెన్సీ!

ఒక్క తప్పు 37.2 కోట్ల రూపాయల కరెన్సీని మూలన పడేట్టు చేసింది. ఈ తప్పు చేసింది భారత రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ‘దివాస్’. మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంతకంతో రూ.37.2 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను ముద్రించింది. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తనిఖీల్లో బట్టబయలైంది. నిజానికి భారత రిజర్వు బ్యాంకు గవర్నర్లు మారితే ఆ తదుపరి సంవత్సరం జనవరి నుంచి ముద్రించే అన్ని కరెన్సీ నోట్లపై […]

మూలన పడ్డ రూ. 37.2 కోట్ల కరెన్సీ!
X

ఒక్క తప్పు 37.2 కోట్ల రూపాయల కరెన్సీని మూలన పడేట్టు చేసింది. ఈ తప్పు చేసింది భారత రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ‘దివాస్’. మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంతకంతో రూ.37.2 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను ముద్రించింది. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తనిఖీల్లో బట్టబయలైంది. నిజానికి భారత రిజర్వు బ్యాంకు గవర్నర్లు మారితే ఆ తదుపరి సంవత్సరం జనవరి నుంచి ముద్రించే అన్ని కరెన్సీ నోట్లపై కొత్త గవర్నరు సంతకముండాలి. కానీ, ఆర్బీఐ గవర్నరుగా సెప్టెంబర్ 2013లోనే రఘురాం రాజన్ బాధ్యతలు స్వీకరించినా ఆ తర్వాత ముద్రించిన 500, 100, 20 రూపాయల నోట్లన్నీ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంతకంతోనే ‘దివాస్’ ముద్రించింది. దీంతో ఈ నోట్లను ముద్రణా కార్యాలయంలోనే ఉంచేశారు. ఈ విషయంలో ఆర్బీఐ అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత వీటిని ఏం చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రఘురాం రాజన్ సంతకంతో కేవలం రూ.10 కొత్త నోటు మాత్రమే ఉన్నాయి.

First Published:  3 Aug 2015 8:44 PM
Next Story