Telugu Global
Others

ఎపిలో ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల వేతనాలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల వేతనాలు మరోసారి పెరిగాయి. ఈ విషయాన్ని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పదేళ్ల సీనియారిటీ ఉన్న అధ్యాపకులకు రూ.75 వేలు, ఐదు నుంచి పదేళ్ల మధ్య సీనియారిటీ ఉన్నవారికి రూ.65 వేలు, ఐదేళ్ల కంటే తక్కువ సీనియారిటీ ఉన్నవారికి రూ. 60 వేలకు జీతాలను పెంచారు. ఇతర టీచర్లు, మెంటర్ల జీతాలు 33 శాతం పెంచినట్టు మంత్రి వివరించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందిస్తామని హామీ […]

ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల వేతనాలు మరోసారి పెరిగాయి. ఈ విషయాన్ని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పదేళ్ల సీనియారిటీ ఉన్న అధ్యాపకులకు రూ.75 వేలు, ఐదు నుంచి పదేళ్ల మధ్య సీనియారిటీ ఉన్నవారికి రూ.65 వేలు, ఐదేళ్ల కంటే తక్కువ సీనియారిటీ ఉన్నవారికి రూ. 60 వేలకు జీతాలను పెంచారు. ఇతర టీచర్లు, మెంటర్ల జీతాలు 33 శాతం పెంచినట్టు మంత్రి వివరించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
First Published:  3 Aug 2015 6:42 PM IST
Next Story