మందుబాబులకు పారిశుద్ధ్య శిక్ష
ఇటీవల కాలంలో పబ్లిక్ ప్లేస్‌ల్లోను, డ్రైవింగ్ చేస్తూను చాలామంది పట్టుబడుతున్నారు. ఇందులో మహిళ మణులు కూడా ఉంటున్నారు. వీరికి జరిమానా విధించడం, జైళ్ళలో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉన్నట్టు కనిపించలేదు న్యాయస్థానానికి… అందుకే ఈసారి ఏకంగా వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా శిక్షలను వేయాలనుకుంది కోర్టు. జైలు శిక్షలతోను, జరిమానాలతోను మానసిక పరివర్తన తీసుకురావడం కష్టమని భావించిన కోర్టు ఈసారి మందుబాబులకు సామాజిక శిక్ష విధించింది. పీకల దాకా మద్యం తాగిన మందుబాబులకు ఎర్రమంజిల్ […]
BY sarvi4 Aug 2015 6:21 AM IST
X
sarvi Updated On: 4 Aug 2015 7:28 AM IST
ఇటీవల కాలంలో పబ్లిక్ ప్లేస్‌ల్లోను, డ్రైవింగ్ చేస్తూను చాలామంది పట్టుబడుతున్నారు. ఇందులో మహిళ మణులు కూడా ఉంటున్నారు. వీరికి జరిమానా విధించడం, జైళ్ళలో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉన్నట్టు కనిపించలేదు న్యాయస్థానానికి… అందుకే ఈసారి ఏకంగా వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా శిక్షలను వేయాలనుకుంది కోర్టు. జైలు శిక్షలతోను, జరిమానాలతోను మానసిక పరివర్తన తీసుకురావడం కష్టమని భావించిన కోర్టు ఈసారి మందుబాబులకు సామాజిక శిక్ష విధించింది. పీకల దాకా మద్యం తాగిన మందుబాబులకు ఎర్రమంజిల్ కోర్టు చర్చనీయాంశమైన శిక్ష విధించింది. హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో చెత్తను తొలగించాలని ఆదేశించింది. కోర్టు వేసిన శిక్షకు అప్పీలు చేసుకునే అవకాశం కూడా లేదు. దాంతో మందుబాబులు తమకు పడిన శిక్షను అమలు చేశారు. నీలోఫర్ ఆసుపత్రిలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. కోర్టు వేసిన శిక్షతో ఒక్క దెబ్బకు రెండు పిట్టల మాదిరిగా అటు మందుబాబులకు శిక్ష పడింది… మరోవైపు నీలోఫర్‌లో చెత్త దర్గంధం వదిలింది. శిక్షలన్నీ ఇలా ఉంటే సమాజానికి కూడా మేలు జరుగుతుందంటున్నారు ఆస్పత్రిలో ఉన్న రోగులు… వారితో వచ్చిన జనం. థాంక్స్ టు జ్యుడీషియరీ!
Next Story