తేజ 'హోరాహోరి'గా లవ్ స్టోరీస్ కాపీ కొట్టాడా ?
ప్రపంచంలోనే ది బెస్ట్ అయిన `నేషనల్ జాగ్రఫి` ఛానెల్లో కెమెరామెన్ గా పనిచేసిన ప్రొఫైల్ తేజ సొంతం. ఆ ఛానెల్ కు పని చేయడం అనేది సాధారాణ విషయం కాదు. అలాంటి తేజ చిత్రం సినిమాతో దర్శకుడిగా మారటం, ఆ సినిమా ఘన విజయం సాధించడంతో.. ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. ఉదయ్ కిరణ్ తో పలు చిత్రాలు చేసి సక్సెస్ లు అందుకున్నాడు. కొత్త నటీ నటులతో చిత్రాలు చేస్తూ […]
BY admin4 Aug 2015 5:30 AM IST
X
admin Updated On: 4 Aug 2015 10:53 AM IST
ప్రపంచంలోనే ది బెస్ట్ అయిన 'నేషనల్ జాగ్రఫి' ఛానెల్లో కెమెరామెన్ గా పనిచేసిన ప్రొఫైల్ తేజ సొంతం. ఆ ఛానెల్ కు పని చేయడం అనేది సాధారాణ విషయం కాదు. అలాంటి తేజ చిత్రం సినిమాతో దర్శకుడిగా మారటం, ఆ సినిమా ఘన విజయం సాధించడంతో.. ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. ఉదయ్ కిరణ్ తో పలు చిత్రాలు చేసి సక్సెస్ లు అందుకున్నాడు. కొత్త నటీ నటులతో చిత్రాలు చేస్తూ ఇండస్ట్రీకి చాల మంది కొత్త ఆర్టిస్ట్ లను పరిచయం చేసిన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. టెక్నికల్ గా తేజ ఇండియాలోనే ఒక బెస్ట్ టెక్నిషియన్ ..ఆ విషయంలో ఏమాత్రం సందేహాం లేదు.
మంచి సినిమాటోగ్రఫర్ కావడంతో.. విజువల్ పరంగా తేజ సినిమా ఎప్పుడు నిరాశ పరచదు. అయితే కథకుడిగా మాత్రం తేజ ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యాడు. నితిన్ ను పరిచయం చేస్తూ చేసిన జయం తరువాత.. అదే తరహా చిత్రాలు ఎక్కువగా చేశాడు. అయితే సక్సెస్ అందుకున్నవి నిల్ అనే చెప్పాలి. రెండు సంవత్సరాల క్రితం నీకు నాకు డాష్ డాష్ అనే చిత్రం చేశాడు. ఆ చిత్రంతో ప్రిన్స్ , నందితలను పరిచయం చేశాడు. ఇక తాజగా హోరా హోరి అనే చిత్రం కొత్త వాళ్లతో చేశాడు. సినిమా పోస్టర్స్ చూస్తుంటే.. ఆయన గత చిత్రాల మాదిరే ఉన్నాయి. అయితే తేజ మాత్రం ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నారు. తెలుగులో సక్సెస్ అయిన లవ్ స్టోరి సినిమాలు చాల చూసి .. వాటి ప్రేరణతో ఈ సినిమాను చేసినట్లు ఆడియో రిలీజ్ రోజునే తేజ చె్ప్పారు. దర్శకుడిగా తేజ కమ్ బ్యాక్ చిత్రం గా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అయితే పరిశీలకులు మాత్రం అంగీకరించ లేక పోతున్నారు. తను చేసిన సినిమాల్లో ఒక్కో సీన్ ను కలిపి చేసి వుంటారనే సెటైర్స్ వినిపిస్తున్నాయి. కానీ తేజ మాత్రం ఆ విమర్శల్ని పట్టించుకోకుండా.. తన సినిమా కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే భరోసాతో వున్నారు మరి. ఆయన భరోసా నిజం కావాలని కోరుకుందాం.. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా హోరా హోరి చిత్రం రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు .
Next Story