Telugu Global
Others

ఫ్యామిలీ టూర్లెందుకు బాబు...?

అనేక స‌మ‌స్య‌ల‌తో రాష్ట్ర ప్ర‌జానీకం స‌త‌మ‌త‌మ‌వుతోంది… ఓవైపు ప్ర‌త్యేక హోదాపై కేంద్రం రోజుకో మాట మాట్లాడుతోంది.. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు పోవ‌డ‌మేమిటి..? ఈ ప్ర‌శ్న వేసింది మ‌రెవ‌రో కాదు… సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సాధించాలంటే ముఖ్య‌మంత్రి విదేశాల‌కు కాకుండా ఢిల్లీకి ప‌ర్య‌టించి కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని ఆయ‌న అన్నారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక హోదా వ‌చ్చేవ‌ర‌కు చంద్ర‌బాబు ఢిల్లీలోనే ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌త్యేక హోదా […]

ఫ్యామిలీ టూర్లెందుకు బాబు...?
X

అనేక స‌మ‌స్య‌ల‌తో రాష్ట్ర ప్ర‌జానీకం స‌త‌మ‌త‌మ‌వుతోంది… ఓవైపు ప్ర‌త్యేక హోదాపై కేంద్రం రోజుకో మాట మాట్లాడుతోంది.. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు పోవ‌డ‌మేమిటి..? ఈ ప్ర‌శ్న వేసింది మ‌రెవ‌రో కాదు… సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సాధించాలంటే ముఖ్య‌మంత్రి విదేశాల‌కు కాకుండా ఢిల్లీకి ప‌ర్య‌టించి కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని ఆయ‌న అన్నారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక హోదా వ‌చ్చేవ‌ర‌కు చంద్ర‌బాబు ఢిల్లీలోనే ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న బ‌స్సు యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం చేరుకున్న సంద‌ర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో రామ‌కృష్ణ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్రం రోజుకో మాట మాట్లాడుతుంటే అన్నీ వ‌దిలేసి ముఖ్య‌మంత్రి విదేశీ ప‌ర్య‌ట‌న‌లంటూ తిర‌గ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని రామ‌కృష్ణ ప్ర‌శ్నించారు. రాజీనామాల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్ సినిమా డైలాగులు చెబుతున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడిన వెంక‌య్య‌నాయుడు ఇపుడు మ‌రోలా మాట్లాడుతున్నార‌న్నారు. ఈనెల 10 లోపు ప్ర‌త్యేక హోదాపై ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే 11న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామ‌న్నారు.

First Published:  4 Aug 2015 6:50 AM IST
Next Story